By: ABP Desam | Updated at : 18 Nov 2021 06:16 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
స్కోడా స్లేవియా కారు
స్కోడా కొత్త సెడాన్ కారును కంపెనీ అధికారికంగా రివీల్ చేసింది. అదే స్లేవియా కారు. మనదేశంలో ర్యాపిడ్ కారును రీప్లేస్ చేసేందుకు స్కోడా దీన్ని లాంచ్ చేసింది. ఆక్టేవియా కంటే కాస్త కింద రేంజ్‌లో ఈ స్లేవియా కారు నిలవనుంది. ఎంక్యూబీ ఏ0 ఇన్ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించిన రెండో కారు ఇదే. ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతానికి కుషాక్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ కొత్త స్లేవియా కాస్త పెద్దగా, విశాలంగా, ర్యాపిడ్ కంటే కాస్త పొడవుగా కూడా ఉండనుంది. చాలా పెద్ద వీల్ బేస్‌ను కూడా ఇందులో అందించనున్నారు. ప్రస్తుతం ఈ రేంజ్‌లో అందుబాటులో ఉన్న అన్ని కార్ల కంటే దీని బూట్ స్పేస్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
దీని ఇంటీరియర్లలో కూడా మార్పులు చూడవచ్చు. కొత్త స్కోడా డిజైన్‌లో ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్‌తో పాటు దీని ట్రేడ్ మార్కు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది. టచ్ స్క్రీన్ సైజు 10.1 అంగుళాలుగా ఉంది. ఇందులో అవసరమైన ఫీచర్లు అన్నీ ఉన్నాయి. స్లేవియాలో లెదరెట్ అప్‌హోల్స్‌టెరీ, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానికి సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్లు, టచ్ ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.
ప్రీమియం ఆడియో సిస్టం, ఆటో హెడ్‌ల్యాంప్స్‌తో పాటు ఆరు ఎయిర్ బాగ్స్, మల్టీ కొలిజన్ బ్రేక్, క్రూజ్ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. కుషాక్ తరహాలోనే ఇందులో కూడా టర్బో చార్జ్‌డ్ ఇంజిన్ అందించారు. ఇందులో రెండు టర్బో పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి.
దీని రేంజ్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ నుంచి మొదలవనుంది. 115 హెచ్‌పీని ఇందులో అందించారు. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కార్లు ఉన్నాయి. ఇక అత్యంత శక్తివంతమైన 1.5 టీఎస్ఐ వేరియంట్‌లో 150 హెచ్‌పీ, 250ఎన్ఎం టార్క్ ఉండనుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఉండనుంది.
1.5 టీఎస్ఐ కుషాక్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తరహాలో ఉండనుంది. ఈ స్కేవియా వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా వంటి మిడ్ రేంజ్ ప్రీమియం కార్లతో స్లేవియా పోటీ పడే అవకాశం ఉంది.
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Maruti Suzuki: గ్రాండ్ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్
Bajaj Qute Auto Taxi: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..
Maruti Suzuki: ఈ కార్ మోడల్స్ మీ దగ్గర ఉంటే వెంటనే కంపెనీకి తిప్పి పంపండి, ఆలస్యం చేస్తే ప్రాణగండం
Tata Motors: సఫారీ, హారియర్ల్లో రెడ్ ఎడిషన్లు లాంచ్ చేసిన టాటా - వావ్ అనిపించే ఫీచర్లు!
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?