Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..

నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.26 పైసలు తగ్గింది. రూ.109.53 గా ఉంది. డీజిల్ ధర రూ.0.24 పైసలు తగ్గి రూ.95.85 గా ఉంది.

FOLLOW US: 

కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, తాజాగా కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కాస్త ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర కూడా స్థిరంగా ఉండి రూ.107.69 గానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.26 పైసలు తగ్గింది. రూ.109.53 గా ఉంది. డీజిల్ ధర రూ.0.24 పైసలు తగ్గి రూ.95.85 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా పెరిగింది. లీటరుకు రూ.0.14 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.51 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.15 పైసలు పెరిగి రూ.96.59గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.90గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.02 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.97గా ఉంది. ఇది లీటరుకు రూ.0.02 పైసలు పెరిగింది.

తిరుపతిలోనూ ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.61 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.71 పైసలు తగ్గింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.65 పైసలు తగ్గి రూ.96.63గా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా నవంబరు 19 నాటి ధరల ప్రకారం 79.26 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

Also Read: Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. రూ.400 ఎగబాకిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ..

Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

Petrol-Diesel Price, 16th May: వాహనదారులకు హ్యాపీ ! చాలా చోట్ల స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇక్కడ మాత్రం స్థిరం

Petrol-Diesel Price, 16th May: వాహనదారులకు హ్యాపీ ! చాలా చోట్ల స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇక్కడ మాత్రం స్థిరం

Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!

Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Satyam Babu: అయేషా మీరా హత్య కేసు - ఇంకా న్యాయం జరగలేదంటోన్న నిర్దోషి సత్యం బాబు, అతడి బాధలు వర్ణనాతీతం

Satyam Babu: అయేషా మీరా హత్య కేసు - ఇంకా న్యాయం జరగలేదంటోన్న నిర్దోషి సత్యం బాబు, అతడి బాధలు వర్ణనాతీతం

Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై

Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై

Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?

Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?

Pranitha Subhash: నటి ప్రణీత సీమంతం ఫంక్షన్ - ఫొటోలు వైరల్

Pranitha Subhash: నటి ప్రణీత సీమంతం ఫంక్షన్ - ఫొటోలు వైరల్