Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
SSMB29: రాజమౌళి, మహేశ్‌బాబు లేటెస్ట్ మూవీ 'SSMB29' (వర్కింగ్ టైటిల్). ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. ఇటీవల సోదరుని పెళ్లి కోసం ముంబై వెళ్లిన ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Priyanka Chopra Arrives In Hyderabad For SSMB29 Shooting: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇటీవల తన సోదరుడి పెళ్లి కోసం ముంబై వెళ్లిన ప్రియాంక తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మూవీ షూట్ కోసం తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు తన ఇన్ స్టా హ్యాండిల్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయల వివాహం ఈ నెల 7న జరగ్గా.. ప్రియాంక చోప్రా ఈ నెల 2వ తేదీనే ముంబై చేరుకున్నారు. పెళ్లి సందడి ముగిసిన అనంతరం తిరిగి 'SSMB29' మూవీ షూట్ కోసం తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
నో లీక్స్.. అన్నీ ఊహాగానాలేనా..
ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి లీక్స్ లేకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పలు అప్ డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. మహేశ్, ప్రియాంక చోప్రా మినహా సినిమా నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. అన్నీ ఊహాగానాలు, క్రేజీ న్యూస్ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతున్నవి మాత్రమే ఉన్నాయి. ప్రియాంక రోల్‌కు సంబంధించిన ఓ న్యూస్ సైతం ఇటీవల నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ అడ్వెంచర్ మూవీలో హీరోతో పాటు ప్రియాంక పాత్రకు సైతం అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. లేడీ విలన్‌గా నెగిటివ్ రోల్‌లో ఆమె కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఆమె రోల్‌ను దర్శక ధీరుడు రూపుదిద్దుతున్నారని సమాచారం.
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
షూటింగ్‌లో నో వాటర్ బాటిల్స్
ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాజమౌళి స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారు. లీక్స్ పట్ల ఇప్పటికే మూవీ టీంకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నటీనటులు సాంకేతిక నిపుణులతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. దర్శక నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా సమాచారం లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఈ సినిమా ఖర్చుల విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. షూటింగ్‌లో రోజుకు దాదాపు 2 వేల మంది వరకూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సెట్‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా బ్యాన్ చేసినట్లు సమాచారం. మహేశ్‌బాబుతో సహా ప్రతి ఒక్కరూ ఈ రూల్ ఫాలో కావాల్సిందేనట. సెట్‌లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేస్తున్నారట. పర్సనల్‌గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: సాయిపల్లవికి ముద్దు పెట్టిన లేడీ ఫ్యాన్ - రజినీ 'భాషా' స్టైల్‌లో ఎలివేషన్స్ మామూలుగా లేదుగా..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

