Saipallavi: సాయిపల్లవికి ముద్దు పెట్టిన లేడీ ఫ్యాన్ - రజినీ 'భాషా' స్టైల్‌లో ఎలివేషన్స్ మామూలుగా లేదుగా..
Sai Pallavi: 'తండేల్' రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి చేతిపై ఓ అభిమాని ముద్దు పెట్టిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. 'భాషా' రేంజ్ ఎడిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Lady Fan Kisses To Sai Pallavi Video Gone Viral: తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi). చేసింది తక్కువ సినిమాలే అయినా అచ్చమైన తెలుగమ్మాయిలా పాత్రలో ఒదిగిపోతూ తెలుగు ఆడియన్స్ మదిలో ఓ చెరగని ముద్ర వేశారు ఆమె. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆమె నటనకు ఫిదా అయిపోతారు. సాయిపల్లవి లేటెస్ట్ మూవీ 'తండేల్'లో నాగచైతన్య సరసన అద్భుత నటనతో మెప్పించారు. 'బుజ్జి తల్లి'గా ఆమె పండించిన ఎమోషన్స్ వేరే లెవల్. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అంతకు ముందు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ లేడీ ఫ్యాన్ ఆమె చేతికి ముద్దు పెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
❤️🔥🧎🏻♂️😋 pic.twitter.com/1IFhJl5LH0
— SHANMUKH (@Shanmukh_008) February 15, 2025
సాయిపల్లవి దగ్గరకు వచ్చిన ఓ అమ్మాయి 'తండేల్' ఈవెంట్‌లో ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిపై ముద్దు పెట్టుకున్నారు. రజినీకాంత్ 'భాషా' రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ ఎడిట్ చేసిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'భాషా' సినిమాలో రజినీ మాణిక్ భాషాగా మారిన సమయంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన చేతిపై ముద్దు పెట్టుకుంటారు. ఆ రేంజ్ లెవల్‌లో దీన్ని ఓ వ్యక్తి ఎడిట్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వైరల్ అవుతోంది.
Also Read: కమెడియన్ యోగిబాబు కారుకు ప్రమాదం - ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యోగిబాబు
నేషనల్ అవార్డుపై సాయిపల్లవి సెంటిమెంట్
'తండేల్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేషనల్ అవార్డుపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 'జాతీయ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే.. నాకు 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు అది కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. కాబట్టి నేను పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకుందామనుకున్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఓ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప. కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. దాన్ని అందుకున్న అందుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకూ నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది.' అని సాయిపల్లవి తెలిపారు.
రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'తండేల్'
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'తండేల్' విడుదలైన రోజు నుంచే రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.95 కోట్ల మార్క్ దాటేసి రూ.100 కోట్ల మైల్ స్టోన్‌కు చేరువలో ఉంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాస్ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

