Yogibabu: కమెడియన్ యోగిబాబు కారుకు ప్రమాదం - ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యోగిబాబు
Yogi Babu Car Accident: కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబుకు కారు ప్రమాదంలో గాయాలయ్యాయంటూ వచ్చిన వార్తలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో తనకు ఏమీ కాలేదని యోగిబాబు స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.

Yogibabu Clarity On His Car Accident News: కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yoigbabu) తెలుగు ఆడియన్స్‌కు సైతం పరిచయం అక్కర్లేని పేరు. అటు, తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిందని ఉదయం నుంచీ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. చెన్నై - బెంగుళూరు నేషనల్ హైవేపై తమిళనాడులోని రాణిపేటలో యోగిబాబు ఉన్న కారు ప్రమాదానికి గురైందనే ప్రచారం నడిచింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీకొట్టినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో యోగిబాబుకు ఏమైనా జరిగిందా.? అనే దానిపై క్లారిటీ లేదు. కొన్ని మీడియా ఛానెల్స్‌లో మాత్రం ఆయనకు గాయాలయ్యాయని.. కొన్నింటిలో మాత్రం ఆయన స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు.
'ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం'
ఈ వార్తలపై నటుడు యోగిబాబు స్వయంగా స్పందించారు. ఇందులో నిజం లేదని తాను క్షేమంగానే ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. తన కారు యాక్సిడెంట్ గురించి షేర్ చేసిన వార్తను ట్వీట్ చేసిన ఆయన.. అది ఫేక్ న్యూస్ అంటూ స్పష్టత ఇచ్చారు. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది కానీ ఆ కారులో తాను లేనని.. కనీసం తన సహాయకుడు కూడా లేడని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందామని.. అలాంటి రూమర్స్ గురించి పట్టించుకోవద్దంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q
— Yogi Babu (@iYogiBabu) February 16, 2025
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్..
యోగిబాబు కెరీర్ పరంగా 2009లో వచ్చిన యోగి చిత్రంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సపోర్టింగ్ రోల్స్, స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఫేవరెట్ కమెడియన్ అయిపోయారు. ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ సినిమాలో రజనీకాంత్ పక్కన ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ బాగా క్లిక్ అయ్యింది. అలాగే, లవ్ టుడే, బీస్ట్, మండేలా, వారసుడు, ది గోట్ వంటి చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన చేసిన 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చుకుంది. ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తోన్న 'రాజాసాబ్' సినిమాలోనూ యోగిబాబు నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హీరోగా సైతం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిల్ట్రన్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ చిత్రం ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చింది.
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

