Testosterone: టెస్టోస్టిరాన్ గురించి తెగ చర్చించేస్తున్న సోషల్ మీడియా - నేవీ అధికారిని చంపిన భార్య కేసే కారణం !
Viral News: టెస్టోస్టిరాన్ మగవాళ్లలో తగ్గడం వల్లే ఘోరాలు జరుగుతున్నాయా? ఓ నెటిజన్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది.

Testosterone in men: యూపీలో ఇటీవల ఓ ఘోరమైన హత్య జరిగింది. నేవీలో పని చేసే వ్యక్తిని అతని భార్య, ప్రియుడితో కలిసి చంపేసింది. ముక్కలు చేసి డ్రమ్ములో పోసి కాంక్రీట్ పోసింది. తర్వాత ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి విహారయాత్రకు వెళ్లారు. తర్వాత దొరికిపోయారు. అయితే ఈ అంశంపై ఓ నెటిజన్ స్పందించారు. పెళ్లి చేసుకునే ముందు టెస్టోస్టిరాన్ టెస్టు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఆ అకౌంట్ మహిళ పేరుతో ఉండటంతో ఈ కామెంట్ విస్తృతంగా వైరల్ అవుతోంది.
Testosterone certificate context pic.twitter.com/bATgfDhnje
— Pavan Tej (@pavantej_23) March 24, 2025
అయితే ఆ నెటిజన్ ఆ తర్వాత ఆ కామెంట్ ను డిలీట్ చేశారు. కానీ నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్స్ తీసుకుని చర్చిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలుగు డాక్టర్ ఒకరు.. ఈ టెస్టోస్టిరాన్ .. గురించి పూర్తి వివరాలతో ఓ పోస్టు పెట్టారు.
టెస్టోస్టెరోను/ మగవాళ్ళ లైంగిక పటుత్వం పై ఒక వ్యాసం.
— Srikanth Miryala (@miryalasrikanth) March 25, 2025
టెస్టోస్టెరోను ఒక హార్మోను. ఇది వృషణాల్లో (టెస్టికల్స్) తయారవుతుంది. ఇది లైంగిక (సెక్సువల్) కోరికలు కలగడానికి, అలాగే లైంగిక క్రియ (సెక్స్)జరపడానికి, పిల్లలు పుట్టడానికి ముఖ్యమైనది. అంతే కాకుండా మగవాళ్ల మనసు,… pic.twitter.com/sVMsxuIULJ
అయితే ఈ అంశంపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. టెస్టోస్టిరాన్ సర్టిఫికెట్ ఇక ముందు పెళ్లిళ్లలో తప్పని సరి అవుతుందన్న సెటైర్లు వేస్తున్నారు. .
Girls requirements then:
— Sai (@SamanthaFreak_) March 24, 2025
Baaga chuskunevadu, ardam cheskunevaadu kavali
Girls requirements now :
Payslip, passbook, gym subscription receipt, testosterone report and 69 other documents pic.twitter.com/VvstK4cht9
ఈ పోస్టు వైరల్ కావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని.. ఎంతో మందికి చాలా విషయాలపై అవగాహన వస్తుందని కొంత మంది అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది andrologists ఉన్నా చెప్పలేని/చెప్పలేకపోయిన
— కాస్కోరా.. షెకావత్ సార్ నా కొడకా (@Icon_StAAr_Rule) March 25, 2025
"Testosterone Maxxing will boost Men's health"
అనే విషయాన్ని ఒక్క పోస్ట్ తో ఊదిపడేశారు 🔊🔊 కదండీ @kanthify
🙏🙏#TestosteroneSaveLives#TestosteroneCertificate https://t.co/WemUiOJKjq pic.twitter.com/yHwtR2CnIL
కొంత మంది ప్రాబ్లం టెస్టోస్టిరాన్ లో ఉండదని..కేవలం బుద్దిలోనే ఉంటుందని కౌంటర్ ఇస్తున్నారు.
Problem Testosterone levels kadu,Aayana Family ki manchi life ivvalani Dooram Unna parledu ani manchi position lo unchali family ni ani Navy lo join avvadam,
— Uzumaki Vicky (@Uzumaki_Vikky) March 25, 2025
Ala kakunda Em pani cheyyakunda Rojantha intlone untu thenguthunte ilantivi ayyevi kadupic.twitter.com/NIIgn9c6Je pic.twitter.com/xBZquIFyVo
ఇటీవలి కాలంలో వివాహేతర బంధాల కారణంగా కుటుంబాల్లో ఏర్పడుతున్న రగడ.. జరుగుతున్న నేరాల కారణంగా కూడా ఇప్పుడు టెస్టోస్టిరాన్ పై ఎక్కువ చర్చ జరుగుతోందని అనుకోవచ్చు. రెండు వైపులా ఎవరి వాదన వారు వినిపించేవారు ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

