Canada Investor Visa: అమెరికా కన్నా కెనడా ఇన్వెస్టర్ వీసాకే డిమాండ్ ఎక్కువ - అక్కడ పెట్టే పెట్టుబడి తిరిగిచ్చేస్తారు కూడా !
Investor Visa : అమెరికాలో ట్రంప్ గోల్డ్ కార్డ్ అమ్ముతున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇది గ్రీన్ కార్డు లాంటిది. చాలా ఖరీదు. అయితే కెనడా ఇన్వెస్టర్ వీసాకు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది.

Canada Investor Visa Demand: చాలా మంది ప్రముఖులు కొన్ని దేశాల్లో స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తూంటారు. అమెరికాలో వెల్లువలా ఉండేందుకు వస్తారన్న ఉద్దేశంతో ట్రంప్ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు. దాదాపుగా 42 కోట్ల రూపాయలు దీని కోసం కట్టాల్సి ఉంటుంది. కానీ కెనడాలో ఇంకా సింపుల్ గా ఇన్వెస్టర్ వీసాలభిస్తుంది. కెనడాలో పెట్టుబడి పెట్టడం ద్వారా శాశ్వత నివాసాన్ని పొందేందుకు కెనడా ఇన్వెస్టర్ వీసా ఓ మార్గం. కెనడాలో ఒక వ్యాపారంలో కనీసం 1.2 మిలియన్ కెనడా డాలర్లు పెట్టుబడి పెడితే ఇన్వెస్టర్ వీసా వస్తుంది. మన రూపాయల్లో ఇది కేవలం ఏడు కోట్లు మాత్రమే. అయితే ఇది పూర్తిగా కెనడాకు చెల్లించాల్సిన పని లేదు. ఈ పెట్టుబడి కెనడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఐదేళ్ల తర్వతా వడ్డీ లేకుండా తిరిగి ఇచ్చేస్తున్నారు.
చట్టబద్ధంగా సంపాదించిన రెండు మిలియన్ కెనడా డాలర్లకు సరిపడా ఆస్తి కలిగి..రెండేళ్లు వ్యాపారం చేసిఉండాలి. ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్** భాషలు వచ్చి ఉండాలి. ఈ నిబంధనలు పూర్తి చేసిన వారికి కెనడా ఇన్వెస్టర్ వీసా వస్తుంది. ఇన్వెస్టర్ వీసా కింద శాశ్వత నివాసం పొందిన వారు కెనడాలో **నివసించడానికి, పని చేయడానికి మరియు చదువుకోవడానికి** అనుమతి పొందుతారు. కెనడా ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన , సంపన్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. పెట్టుబడులకు సురక్షితమైన ప్రదేశంగా ఉంటుంది. టెక్నాలజీ, సహజ వనరులు, ఆరోగ్య సంరక్షణ వంటి విభాగాలలో వ్యాపార అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.
కెనడా ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు సబ్సిడీలు, రాయితీలు మరియు ప్రోత్సాహకాల ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది వ్యాపారవేత్తలకు సులభంగా వ్యాపారం స్థాపించడానికి బాగుంటుంది. కెనడా ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సేవలకు ప్రసిద్ధి చెందింది. జీవించడానికి, పని చేయడానికి, పిల్లలను పెంచడానికి ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా ప్రపంచంలోని ప్రజలు భావిస్తారు. అంతే కాదు కెనడా పాస్ పోర్టు కూడా లభిస్తుంది. కెనడా పాస్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి, ఇది 180కి పైగా దేశాలకు వీసా లేకుండా .. లేదా ఎయిర్ పోర్టులోనే వీసా ఇచ్చే అవకాశాన్ని ఇస్తుంది. సం తరచూ విదేశాలకు ప్రయాణించాల్సిన వ్యాపారవేత్తలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఇన్వెస్టర్ వీసా కోసం కెనడా ప్రత్యేకంగా ప్రచారం కూడా చేస్తోంది. స్టార్ట్-అప్ వీసా వంటి స్కీమ్‌లను ప్రవేశ పెట్టి వ్యాపారవేత్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. కెనడాలో జీవన ప్రమాణాలు అమెరికాకు ఏ మాత్రం తగ్గవు. అమెరికాలో 42 కోట్లు పెట్టి గోల్డ్ కార్డు తీసుకున్నప్పటికీ.. వ్యాపారం చేయగలిగితే సరే లేకపోతే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వరు.కానీ కెనడాలో ఐదేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తారు . ఇది చాలా మందిని ఆకర్షిస్తోంది. పంజాబ్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అనేక వందల మంది ఇన్వెస్టర్ వీసాతోనే కెనడాలో శాశ్వత పౌరసత్వం పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా గోల్డ్ కార్డ్ భారం కావడంతో చాలా మంది కెనడా వైపుచూసే అవకాశాలు ఉన్నాయి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

