సాయిపల్లవి అంటే చిన్ని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడతారు. ఆమె ఎంచుకున్న సినిమాలు, ఆమె డ్రెస్ ఈ విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఎప్పుడూ ట్రెడీషనల్ లుక్స్‌లోనే సాయి పల్లవి కనిపిస్తుంది. సినిమాల్లో కూడా అలానే ఉంటుంది. అయితే సాయిపల్లవి కూడా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకునేదట. కానీ ఓ సందర్భం వల్ల తాను మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవడం మానేసినట్లు చెప్పింది. విదేశి డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు ఆ దేశానికి తగ్గ డ్రెస్ వేసుకుందట. సాల్సా చేసేందుకు ఈజీగా ఆ డ్రెస్‌ని డిజైన్ చేశారట. అలా నేర్చుకున్న సమయంలో.. ఆ దేశంలో ఎలాంటి ఇబ్బందిని ఆమె ఎదుర్కోలేదట. కానీ ప్రేమమ్ రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిందని తెలిపింది సాయిపల్లవి. వీడియోను పాజ్ చేసి మరీ.. ఫోటోలను సోషల్ మీడియాలో చేసి.. చాలా ఘోరంగా మాట్లాడారని తెలిపింది. అందుకే ఇక మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోకూడదని.. తనకి, తన ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించని డ్రెస్‌లే వేసుకోవాలని ఫిక్స్ అయిందట. అందుకే సినిమాల్లో, బయట కూడా మోడ్రన్ డ్రెస్‌లలో కూడా.. ట్రెడీషనల్ లుక్‌లోనే కపిస్తుంది.