రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రణ్‌బీర్ చేతిలో అన్నీ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులే ఉన్నాయి. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘ధూమ్ 4’లో కూడా రణ్‌బీర్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గతంలో ‘తూ జూతీ మై మక్కర్’ అనే లవ్ స్టోరీలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇటీవలే శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ‘స్త్రీ 2’ బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరి ‘ధూమ్ 4’ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. రణ్‌బీర్ రాముడి పాత్రలో కనిపిస్తున్న ‘రామాయణం’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’, ‘యానిమల్ పార్క్’ల్లో కూడా నటించనున్నారు.