నాగార్జున: 2024 నాకు చాలా ప్రత్యేకం! ఈ సంవత్సరం తనకెంతో ప్రత్యేకం అన్నారు అక్కినేని నాగార్జున. ఈ ఏడాది ANR శతజయంతి వేడుకలు జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు నాగార్జున ఈ సందర్భంగా అక్కినేని అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నాగార్జున. చిన్నగ్రామంలో జన్మించి ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరుకున్న ANR శతజయంతిని ఇప్పటికే చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకున్నాం - నాగ్ లేటెస్ట్ గా ఆయన పేరుమీద అవార్డులు ప్రదానం చేస్తున్నాం..ANR అవార్డును నా మిత్రుడు చిరంజీవికి ప్రదానం చేయడం అత్యంత సంతోషం - నాగ్ అక్టోబరు 28న జరగనున్న ఈ వేడుకలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొనబోతున్నారని చెప్పారు ఒకే వేదికపై ఇద్దరు లెజెండ్స్ సందడి చేయబోతున్నారని..ఈ వేడుకను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు మరపురానిదిగా చేద్దాం అన్నారు