Allu Arjun: పాన్ వరల్డ్ రేంజ్‌లో బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - భారతదేశమే ఆశ్చర్యపోతుందన్న నిర్మాత నాగవంశీ
Naga Vamsi: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఇది ఎవరూ ఊహించని స్టోరీ అని.. పాన్ వరల్డ్ స్థాయిలో ఎవరికీ తెలియని ఓ గాడ్ కథ ఆధారమని చెప్పారు.

Producer Naga Vamsi About Allu Arjun Trivikram Mythological Project: 'పుష్ప 2' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో (Trivikram Srinivas) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఓ మైథలాజికల్ స్టోరీ అని ఇప్పటివరకూ ఎవరూ చూడని రేంజ్‌లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇదివరకే చెప్పారు. తాజాగా ఈ సినిమాపై మరోసారి ఆయన అదిరే అప్ డేట్ ఇచ్చారు.
ఎవరూ ఊహించని స్టోరీ..
'సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి మైథలాజికల్ మూవీస్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఎందుకు ఆ జోనర్‌లో మూవీస్ తగ్గాయి' అన్న ప్రశ్నకు నాగవంశీ (Naga Vamsi) సమాధానమిచ్చారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మైథలాజికల్ మూవీస్ తీయడం ఎందుకు తగ్గిపోయిందో తనకు తెలియదని.. కానీ తాము అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో కలిసి ఓ మైథలాజికల్ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్పారు. 'ఈ మూవీ చూసి భారతదేశం ఆశ్చర్యపడుతుంది.
— VVK (@VKrishna_V) March 25, 2025
రామాయణం, మహాభారతం వంటి ప్రసిద్ధ ఇతిహాసాల మీద కాకుండా.. ఎవరికీ తెలియని మైథలాజికల్ కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది. పురాణాల్లో ఎవ్వరికీ తెలియని ఓ గాడ్ కథ. ఆ గాడ్ పేరు విన్నా ఆయన వెనుక ఉన్న కథ ఎవరికీ తెలియదు. దాని ఆధారంగానే మేము సినిమాను రూపొందిస్తున్నాం.' అని నాగవంశీ తెలిపారు.
బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో వీరి కాంబోలో వస్తోన్న సోషియో మైథలాజికల్ ఫాంటసీ 'AA22' ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సమ్మర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మరోవైపు, ఈ మూవీ కథ ఇంకా పూర్తి కాలేదని.. త్రివిక్రమ్ ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడని ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే అట్లీతో బన్నీ ముందుకు వెళ్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ స్క్రిప్ట్ ఓకే అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంటే ముందే ఈ మూవీ స్టార్ట్ అవుతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. నాగవంశీ తాజా కామెంట్స్‌తో బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

