Spider Man Telugu Trailer: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది. ఈసారి అన్ని విశ్వాల విలన్లతో మన సాలీడు హీరో పెద్ద సవాళ్లనే ఎదుర్కోనున్నాడు.
‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు గుడ్ న్యూస్. మరో నెల రోజుల్లోనే ‘నో వే హోమ్’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈసారి కూడా నేరుగా తెలుగులోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాబట్టి.. ఇక మీరు పండగ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ సంస్థ బుధవారం ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ ట్రైలర్‌ను విడుదల చేసింది. జాన్ వాట్స్ నిర్మించిన ఈ ‘స్పైడర్ మ్యాన్’ సీరిస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
హీరో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఈ సారి ‘డాక్టర్ స్ట్రేంజ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ట్రైలర్ ప్రకారం.. స్పైడర్ మ్యాన్ ఎవరనేది ప్రపంచానికి తెలిసిపోవడంతో పీటర్ చిక్కుల్లో పడతాడు. అంతేగాక గత సీరిస్‌లో స్పైడర్ మ్యాన్‌తో పోరాడి చనిపోయిన మిస్టీరియో కేసు కూడా అతడిని వెంటాడుతుంది. ఈ చిత్రానికి ముందు సీరిస్‌లో మిస్టీరియోనే విలన్ అనే సంగతి తెలిసిందే. అందులో అతడు డ్రోన్ల ద్వారా వింత ఆకారాలను సృష్టిస్తాడు. వాటిని అంతం చేసి ప్రజలను కాపాడుతున్నట్లుగా నటిస్తాడు. దీంతో అంతా అతడిని సూపర్ హీరో అని అనుకుంటారు. ఈ కుట్రను కనిపెట్టిన స్పైడర్ మ్యాన్ అతడితో పోరాడతాడు. ఈ క్రమంలో మిస్టీరియో చనిపోతాడు. దీంతో ప్రజలంతా స్పైడర్ మ్యాన్‌ను అంతా శత్రువులా చూస్తారు. పైగా స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కరే అని తెలిసిపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ‘నో వే హోమ్’ సీరిస్‌లో ఈ కథే నడుస్తుంది.
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఈ సమస్యల నుంచి తనను బయటపడేయాలంటూ పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్‌ను ఆశ్రయిస్తాడు. తానే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలని కోరతాడు. దీంతో డాక్టర్ స్ట్రేంజ్.. జనాలు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని మరిచిపోయేలా చేస్తాడు. కానీ, అప్పటి నుంచి అసలు సమస్యలు మొదలవుతాయి. పీటర్ పార్కర్‌కు పాత శత్రువులు మళ్లీ ఎదురవుతారు. వివిధ విశ్వాల్లోని విలన్లంతా ఒక్కసారే భూమిపై దాడికి దిగుతారు. డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో స్పైడర్ మ్యాన్ వారితో పోరాడుతాడు. ఈ సమస్యలను పీటర్ పార్కర్ ఎలా ఎదుర్కొంటాడనేది బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. ఈ ఏడాది డిసెంబరు 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్పైడర్ మ్యాన్ తెలుగు ట్రైలర్‌ను ఇక్కడ చూసేయండి.
‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ ట్రైలర్:
Also Read: పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..
Also Read: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి