అన్వేషించండి
Advertisement
Jai Bhim: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
'జై భీమ్' సినిమాతో పార్వతి అమ్మాళ్ గురించి బయటప్రపంచానికి తెలియడంతో.. చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.
ఈ లాక్ డౌన్ లో హీరో సూర్య నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఒకటి 'ఆకాశం నీ హద్దురా', రెండోది 'జై భీమ్'. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా 'జై భీమ్' సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..
అన్యాయంగా తన భర్తను జైల్లో పెట్టారని.. అతడిని కాపాడుకోవడానికి ఓ గిరిజన మహిళ చేసే పోరాటంలో చంద్రు ఆమెకి సాయం చేస్తారు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి. సినిమాలో గిరిజన మహిళగా సినతల్లి అనే పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్పూర్తితో ఈ పాత్రను రాసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు.

దీంతో సూర్య ఆమెను ఆర్థికంగా ఆదుకున్నారు. 15 లక్షల రూపాయల చెక్కును 2D Entertainment production పేరుతో బాధితురాలు పార్వతి అమ్మాళ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోరాట యోధుడు (తమిళనాడు సిపియం రాష్ట్ర కార్యదర్శి) కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి చెక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'జై భీమ్' సినిమాతో పార్వతి అమ్మాళ్ గురించి బయటప్రపంచానికి తెలియడంతో.. చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఆమెకి సొంతిల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion