News
News
X

Pushpa: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

'పుష్ప: ద రైజ్'లో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. అందులో అల్లు అర్జున్‌తో సమంత స్టెప్స్ వేయనున్నారు. ఆ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఓ యంగ్ అండ్ అప్‌క‌మింగ్ టాలెంట్‌కు అల్లు అర్జున్ ఇచ్చారని తెలిసింది.

FOLLOW US: 

'ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం' నుంచి 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' సాంగ్ వరకూ... ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్స్‌ను సుకుమార్ చాలా అంటే చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ తీసిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఇంకా స్పెషల్. 'అ అంటే అమలాపురం', 'రింగ... రింగ' సాంగ్స్ గురించి స్పెష‌ల్‌గా చెప్పనవసరం లేదు. దాంతో ఇప్పుడు 'పుష్ప: ద రైజ్'లో సాంగ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఆడియ‌న్స్‌లో ఉంది. దానికి తోడు ఆ సాంగ్‌లో సమంత స్టెప్స్ వేయనున్నారనే విషయం అంచనాలను ఇంకొంచెం పెంచింది. ఈ పాటను యంగ్ అండ్ అప్ కమింగ్ మాస్టర్ చేత కొరియోగ్రఫీ చేయించాలని అల్లు అర్జున్, సుకుమార్ డిసైడ్ అయినట్టు సమాచారం.

'పుష్ప: ద రైజ్'లో స్పెషల్ సాంగ్‌ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ యశ్ మాస్టర్‌కు దక్కినట్టు తెలుస్తోంది. డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో యశ్ వెలుగులోకి వచ్చారు. అతడి టాలెంట్ చూసి స్టార్స్ అవకాశాలు ఇస్తున్నారు. సమంతతో సాంగ్ చేసిన ఎక్స్‌పీరియ‌న్స్ య‌శ్‌కు ఉంది. 'యు టర్న్' సినిమా థీమ్ సాంగ్ చేశాడు. అయితే... అల్లు అర్జున్‌ లాంటి టాప్ స్టార్‌తో ఇప్పటివరకూ చేయలేదు. 'పుష్ప' అతడికి ఫస్ట్ బిగ్ టికెట్ ఫిల్మ్ అని చెప్పాలి. గతంలోనూ 'ఢీ' నుంచి వచ్చిన కొంత మంది టాలెంటెడ్ డాన్స్ మాస్టర్లకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు డాన్స్‌లో కొత్తదనం చూపించాలని ప్రయత్నించే ఐకాన్ స్టార్, యంగ్ మాస్టర్లకు కూడా ఛాన్సులు ఇస్తున్నారు. 'ప్రతిరోజూ పండగే'లో 'ఓ బావా...', 'చిత్రలహరి' సినిమాలో 'గ్లాస్ మేట్స్', 'సోలో బ్రతుకే సో బెటర్'లో 'నో పెళ్లి...' పాటలకు యశ్ కొరియోగ్రఫీ చేశారు.

అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న  'పుష్ప' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ఐదో పాట అల్లు అర్జున్, సమంతపై చిత్రీకరించనున్న స్పెషల్ సాంగ్. త్వరలో దానిని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
Also Read:  పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..

Also Read: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Nov 2021 12:59 PM (IST) Tags: Allu Arjun Pushpa samantha సమంత అల్లు అర్జున్ Yash Master Pushpa Special Song

సంబంధిత కథనాలు

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Allu Sirish: అల్లు శిరీష్ సినిమాకి కొత్త టైటిల్ - టీజర్ ఎప్పుడంటే?

Allu Sirish: అల్లు శిరీష్ సినిమాకి కొత్త టైటిల్ - టీజర్ ఎప్పుడంటే?

Aadi movie release: తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఆది‘

Aadi movie release: తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఆది‘

టాప్ స్టోరీస్

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

CUET PG Result:  సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam

Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?