తండ్రి - కొడుకు మధ్య విభేదాలున్నాయా? అయితే మకర సంక్రాంతి రోజు ఇవి పాటించండి, మీ బంధం దృఢంగా మారుతుంది!
Makar Sankranti 2026: సూర్యుడు-శని కలయిక తండ్రి-కొడుకు సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ మధ్య వివాదాలుంటే మకర సంక్రాంతి రోజు కొన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు

Makar Sankranti remedy for father and son: ఎవరైతే తండ్రితో సరిగ్గా ఉండరో లేదా ఎప్పుడూ విభేదిస్తూ ఉంటారో, మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా తండ్రి - కొడుకుల మధ్య సంబంధాలలో మాధుర్యం పెరగడంతో పాటు లోతు కూడా పెరుగుతుంది. వాస్తవానికి, మకర సంక్రాంతి సందర్భంగా, సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి న్యాయం, కర్మకు ప్రధాన దేవుడైన శని దేవుడు...శని ఎవరోకాదు.. సూర్యదేవుని కుమారుడు. అంటే శని దేవుడు - సూర్య భగవానుడు తండ్రి కొడుకు. మకర సంక్రాంతి నుంచి నెలరోజుల పాటూ సూర్య దేవుడు మకర రాశిలో అంటే తన కుమారుడైన శని దేవుని ఇంట్లో ఉంటాడు.
ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతి జనవరి 15, 2026 గురువారం వచ్చింది
మకర సంక్రాంతి నాడు ఈ ప్రత్యేక చర్యలు తీసుకోండి
తండ్రితో ఎల్లప్పుడూ విభేదించే పరిస్థితి ఉన్నవారు మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ చర్యలను అనుసరించడం ద్వారా తండ్రి-కొడుకుల సంబంధాలలో మాధుర్యం పెరగడంతో పాటు సూర్య భగవానుడు శని దేవుని ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది.
మకర సంక్రాంతి రోజున వీలైతే, ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. మీ తండ్రి మీతో నడవగలిగితే, వారిని కూడా మీతో పాటు తీర్థయాత్రకు తీసుకెళ్లండి. పుణ్యక్షేత్రంలో గంగా నది ఉంటే, అక్కడకు వెళ్లి తండ్రితో కలిసి స్నానం చేయండి. తండ్రి కొడుకు ఇద్దరూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. భాస్కర్ ప్రణామం చేస్తూ ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.
అన్నదానం చేయండి
స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన బట్టలు ధరించి, ఏదైనా శివాలయంలోకి వెళ్లి, శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీంతోపాటూ 5 ప్యాకెట్ల బియ్యం, పప్పులు, పిండి, నెయ్యి, బెల్లం, ఉప్పు , నువ్వులను దానం చేయండి. ఈ చర్యలు చేసేటప్పుడు మీ మనస్సులో భగవంతుడిని ప్రార్థించండి... తద్వారా తండ్రి-కొడుకు మధ్య సంబంధం మెరుగుపడుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు
తండ్రికి బహుమతిని ఇవ్వండి
మకర సంక్రాంతి రోజున ఈ చర్య తీసుకోవడం ద్వారా మీరు ప్రత్యేక ఫలితాలను పొందుతారు. మీ తండ్రి మీతో తీర్థయాత్రకు వెళ్లడానికి ఇష్టపడకపోతే, మీరు ఒంటరిగా వెళ్లి ఈ చర్యలు చేయండి. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చినప్పుడు, మీ తండ్రిని తప్పకుండా కలవండి, వారికి నమస్కరించి, వారికి నచ్చిన బహుమతిని ఇవ్వండి. మీ తండ్రి మీతో తీర్థయాత్రకు వచ్చినా కానీ వారికి నచ్చిన ఏదైనా బహుమతిని వారికి ఇవ్వండి. ఆ తర్వాత నుంచి మీమధ్య వివాదాలు సమసిపోతున్నట్టు మీకే తెలుస్తుంది..మార్పు గమనిస్తారు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















