Minister Ramanaidu: మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Annadata Sukhibhava : ఏపీలో రైతులు, మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

Matsyakara Bharosa : ఏపీలో రైతులు, మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి రామానాయుడు ప్రచారం చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం తరలి రావాలని కోరారు. శాసనమండలిలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వాలని పట్టభద్రులకు మంత్రి నిమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు...ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
Also Read : Left Parties Protest: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈనెల 18,19 తేదీల్లో దేశవ్యాప్తంగా వామపక్షాల నిరసన
అన్నదాత సుఖీభవ
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో చేపల వేటను నిషేధించిన రోజుల్లో మత్స్యకారుల జీవన భృతి కోసం రూ.20 వేలు అందిస్తామని నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి మత్స్యకారులకు రూ.20 వేలు అందజేస్తామన్నారు. మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన మత్స్యకారుకుల ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది. అలాగే జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున అందజేస్తామని కూటమి హామీ ఇచ్చింది.
పాలకొల్లు లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం తో కలిసి మీడియాతో మాట్లాడటం జరిగింది..#NimmalaRamaNaidu#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu… pic.twitter.com/Je40q4QmbR
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) February 16, 2025
20లక్షల ఉద్యోగాల హామీ
రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా సంకీర్ణ ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చంద్రబాబు నాయుడు తొలి డీఎస్సీపై సంతకం చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డీఎస్సీ విడుదల చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరానికి ముందే ఉపాధ్యాయ పోస్టుల నియామకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read : Bird Flu Latest News:ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
వంశీ అరాచక శక్తి
రాజధాని అమరావతి, పోలవరం వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పునర్నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేయడం సంకీర్ణ ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో జరిగాయని ఆయన గుర్తు చేశారు. అరాచకత్వం, అవినీతి, గూండాయిజానికి అండగా నిలిచే వల్లభనేని వంశీ కూడా అరాచక శక్తి అని ఆయన విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటన జరగలేదని అన్నారు. కానీ వల్లభనేని వంశీ జాతీయ రహదారి పక్కన ఉన్న తెలుగుదేశం కార్యాలయాన్ని ఐదు గంటల పాటు తగలబెట్టడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన వ్యాపారవేత్త వల్లభనేని వంశీ అని ఆయన ధ్వజమెత్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

