News
News
X

Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

వాయిస్ కమాండ్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్‌ను త్వరలోనే గూగుల్ పే తీసుకురానుంది.

FOLLOW US: 

ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే పెద్ద తలనొప్పిలా ఉండేది. బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ ఫామ్ రాసి.. లైన్లో నిల్చొని ఇలా పెద్ద తతంగమే ఉండేది. అయితే యూపీఐ, డిజిటల్ లావాదేవీలు వచ్చాక ఒక్క ట్యాప్ చేస్తే అవతలి వారి ఖాతాలోకి డబ్బులు జమైపోతున్నాయి. అయితే ఇది మరింత సులభతరం కానుంది. కేవలం వాయిస్ చెప్తే చాలు సదరు ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చట. అదేలేగో చూసేయండి.

గూగుల్‌ పే..

ప్రస్తుతం గూగుల్ పే ఏడాదికి 400 బిలియన్ల డాలర్ల లావాదేవీలు జరుపుతోంది. అయితే వినియోగదారులకు మరింత సులభతరం చేసేందుకు మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే వాయిస్ కమాండ్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం. ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

" డబ్బు మనందరి జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే మనీ ట్రాన్సేక్షన్స్ కూడా మనం మాట్లాడుకునేంత సులభంగా ఉండాలి. ఇందుకోసమే హింగ్లీష్ (హిందీ+ఇంగ్లీష్) ఫీచర్‌ను గూగుల్ పేలో యాడ్ చేస్తున్నాం. అలానే కేవలం వాయిస్ కమాండ్‌తో బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.                         "
- గూగుల్

స్పీచ్ టూ టెక్స్ట్..

త్వరలోనే ఈ స్పీచ్ టూ టెక్స్ట్ ఫీచర్‌ను గూగుల్ లాంచ్ చేయనుంది. వాయిస్ ఇన్‌పుట్ ద్వారా మనకు కావాల్సిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అకౌంట్ నంబర్‌ను హిందీ లేదా ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. అనంతరం సెండర్ కన్ఫర్మేషన్ తర్వాత పేమెంట్ జరుగుతుంది.

మై షాప్..

చిన్నచిన్న వ్యాపారులకు లావాదేవీలు మరింత సులభతరం చేసేందుకు త్వరలోనే 'మై షాప్'ను గూగుల్ లాంచ్ చేస్తుంది. గూగుల్ పే యాప్‌లో వారి వ్యాపారాలకు సంబంధించిన చిత్రాలు, వివరణలు, ధరలను నిమిషాల్లో జోడించి.. ఆ లింక్‌ను బిజినెస్ ప్రొఫైల్ ద్వారా గూగుల్ సోషల్ మీడియాల్లో షేర్ చేయొచ్చు. దీని ద్వారా వారి బిజినెస్ మరింత అభివృద్ధి చెందుతుందని గూగుల్ అభిప్రాయపడింది. కొన్ని రోజుల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

జియోతో భాగస్వామ్యం..

భారతదేశ జనాభాలో సగం మంది ఇప్పటికీ స్మార్ట్ ఫోన్‌కు దూరంగానే ఉన్నారు. అలాంటి వారిని చేరుకోవడానికి గూగుల్.. Jioతో భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగానే త్వరలోనే JioPhone Next తీసుకురానుంది. JioPhone Nextలో గూగుల్ అభివృద్ధి చేసిన 'ప్రగతి' OSతో వస్తుంది. ఇంతేకాకుండా మరింత తక్కువ ధరలతో లోకలైజ్‌డ్ స్మార్ట్‌ఫోన్‌లు తీసుకురావడానికి గూగుల్ కృషి చేస్తోంది.

" కోట్లాది మంది  భారతీయులకు సేవ చేసేందుకు గూగుల్ సిద్ధంగా ఉంది. కరోనా సంక్షోభం తర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పెరగడం వల్ల భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. యూపీఐ లావాదేవీల విలువ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్మార్ట్‌ఫోన్‌తో ప్రజలు గడిపే సమయం 20 శాతం పెరిగింది.                                                 "
-సంజయ్ గుప్తా, గూగుల్ ఇండియా వీపీ

Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు

Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 01:39 PM (IST) Tags: Google pay Google for india 2021 voice feature to pay directly to bank account Google Pay Voice Feature

సంబంధిత కథనాలు

Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన

Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన

Petrol-Diesel Price, 5 October: పండగ రోజు ఎగబాకిన ఇంధన ధరలు - మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 5 October: పండగ రోజు ఎగబాకిన ఇంధన ధరలు - మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవీ

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!