EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!
ఈపీఎఫ్‌వో కేంద్ర మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ జమయ్యే డిపాజిట్లలో ఐదు శాతం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టనుంది.
ఉద్యోగ భవిష్య నిధి (EPFO) కేంద్ర బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌లో జమ చేసే వార్షిక డిపాజిట్లలో ఐదు శాతం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు సహా ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (AIFs)లో పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పింఛను, సామాజిక భద్రత, ఈపీఎఫ్‌వోను యూజర్‌ఫ్రెండ్లీ సంస్థగా మార్చేందుకు డిజిటైజేషన్ కోసం నాలుగు సబ్ కమిటీల ఏర్పాటును ఆమోదించింది.
'కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. మేం కేవలం ప్రభుత్వ హామీ ఉండే ప్రత్యా్మ్నాయ ఫండ్లలో పెట్టుబడి పెట్టనున్నాం. ప్రభుత్వ రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లలో పెట్టుబడి పెడతాం' అని కార్మిక, ఉద్యోగ కార్యదర్శి సునీల్ బ్రాత్వల్ తెలిపారు. పెట్టుబడి పెట్టేముందు ఈపీఎఫ్‌వో ఫైనాన్స్, ఆడిట్ కమిటీ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని వెల్లడించారు.
ఏటా ఈపీఎఫ్‌వో రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు జమ అవుతుంది. అందులో ఐదు శాతం అంటే కనీసం రూ.10వేల కోట్లను పెట్టుబడి పెట్టనున్నారు. వీటి ద్వారా ఈపీఎఫ్‌వో పెట్టుబడుల్లో వైవిధ్యం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయ ఫండ్లలో పెట్టుబడి కాస్త నష్టభయంతో కూడుకున్నదేనని అంటున్నారు.
ఇప్పటి వరకు ఈపీఎఫ్‌వో స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్‌ల రూపంలో రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఈ మధ్యే రూ.40వేల కోట్ల వరకు రాబడి వచ్చింది. అలాగే కాకుండా ఇప్పుడు ప్రత్యామ్నాయ ఫండ్ల రూపంలో పెట్టుబడి పెట్టాలని కేంద్రం సిఫారసు చేసింది. కాగా ఈటీఎఫ్‌ల నిర్వహణను యూటీఐ, ఎస్‌బీఐ నిర్వహించేలా కేంద్ర మండలి నిర్ణయం తీసుకుంది.
Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్.. పేటీఎం ఫౌండర్ విజయ గాథ ఇది!
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..
Also Read: Tim Paine Quits: మహిళకు ఆసీస్ క్రికెటర్ అశ్లీల సందేశం.. వివాదం ముదిరి కెప్టెన్సీకి రిజైన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి