GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!
వచ్చే ఏడాది జనవరి నుంచి వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరుగుతున్నాయి. ఐదు శాతం జీఎస్‌టీని 12కు పెంచడమే ఇందుకు కారణం. కనీసం రూ.వెయ్యి వరకు భారం పడే అవకాశం ఉంది.
![GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు! Apparel, footwear to get expensive from January 1, 2022 as govt hikes GST from 5% to 12% GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/696b7eb6f787a073d1607181c36aae39_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
డిజైనరీ వస్త్రాలు, పాదరక్షలు కొనుగోలు చేసే ప్రణాళిక ఏమైనా ఉందా? అయితే త్వరపడండి! లేదంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2022, జనవరి 1 నుంచి దుస్తులు, వస్త్రాలు, రగ్గులు, చెద్దర్లు, పాదరక్షలపై వస్తు సేవల పన్ను పెరగనుంది. పూర్తిగా రూపొందించిన గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్స్‌పై ఐదు శాతం జీఎస్‌టీ ఉండగా దానిని 12 శాతం పరిధిలోకి తీసుకొస్తున్నారు.
నవంబర్ 18న ఈ పెరుగుదల గురించి కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC) నోటిఫై చేసింది. కొన్ని రకాల సింథటిక్ ఫైబర్లు, దారాలపై జీఎస్‌టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారు. తిరగేసిన సుంకాల పద్ధతిని పూర్తిగా మార్చేసి వస్త్ర పరిశ్రమలో పన్నుల ఏకరూపత కోసం ప్రయత్నిస్తున్నామని బోర్డు తెలిపింది.
ఇప్పటి వరకు ఫ్యాబ్రిక్స్‌పై ఉన్న 5 శాతం జీఎస్‌టీని 12కు పెంచడంతో వస్త్రాలు, పాదరక్షలపై రూ.1000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. నేసిన వస్త్రాలు, సింథటిక్ దారాలు, పైల్ ఫ్యాబ్రిక్స్, బ్లాంకెట్లు, టెంట్లు, టేబుల్ క్లాత్స్, రగ్గులు, పాదరక్షల ధరలు పెరగనున్నాయి.
జీఎస్‌టీ పెరుగుదలతో భారత వస్త్రాల తయారీదారుల సంఘం (CMAI) నిరాశకు గురైంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా ముడి వనరులు ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా భారం పెరిగిందని అంటున్నారు.
Also Read: EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!
Also Read: Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)