By: ABP Desam | Published : 21 Nov 2021 12:55 PM (IST)|Updated : 21 Nov 2021 12:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
జెరెమీ సొలొజానో
క్రికెట్ మైదానంలో మరోసారి విషాదకరమైన దృశ్యాలు కనిపించాయి! వెస్టిండీస్ యువ క్రికెటర్ సొలొజానోను స్ట్రెచర్ మీద ఆస్పత్రికి తీసుకెళ్తున్న సన్నివేశాలు అభిమానులను కలచివేస్తున్నాయి. షార్ట్‌పిచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతడి హెల్మెట్‌ను బ్యాటర్ కొట్టిన బంతి బలంగా తగలడంతో కుప్పకూలాడు.
Very unfortunate incident. Jeremy Solozano taken to hospital for scans after this incident while fielding in his first session as a West Indian Test player. #SLvWI https://t.co/opU89hGPcb
— Rick Eyre on cricket (@rickeyrecricket) November 21, 2021
గాలె వేదికగా శ్రీలంక, వెస్టిండీస్ నేడు తొలి టెస్టు ఆడుతున్నాయి. విండీస్ తరఫున యువ ఆటగాడు సొలొజానో నేడే అరంగేట్రం చేశాడు. ఎన్నో ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టాడు. లంకేయులు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. 24వ ఓవర్లో సొలొజానో షార్ట్‌పిచ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. రక్షణగా హెల్మెట్ పెట్టుకున్నాడు. అయితే దిముతు కరుణరత్నె అప్పుడే వచ్చిన బంతిని పుల్‌షాట్ ఆడాడు. దురదృష్టవశాత్తు ఆ బంతి నేరుగా సొలొజానో హెల్మెట్‌కు బలంగా తగిలింది.
🚨Injury Update 🚨 Debutant Jeremy Solozano was stretchered off the field after receiving a blow to his helmet while fielding.
— Windies Cricket (@windiescricket) November 21, 2021
He has been taken to the hospital for scans. We are hoping for a speedy recovery 🙏🏽#SLvWI pic.twitter.com/3xD6Byz1kf
ఫీల్డర్ అక్కడే విలవిల్లాడటంతో వెంటనే వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతడిని పరీక్షించి స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకెళ్లారు. అట్నుంచి అటే స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత ఏంటని తెలియలేదు. వైద్య నిపుణులు చెప్పగానే అతడి ఆరోగ్య పరిస్థితిని అందరికీ వివరిస్తామని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. సొలొజానోకు ఏం కావొద్దని, అతడు ఆరోగ్యంగా తిరిగి రావాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు.
Watch the moment Jeremy Solozano receives his maiden test cap from the #MenInMaroon 👏🏿
— Windies Cricket (@windiescricket) November 21, 2021
WI wish him well in this test match and many more to come! #SLvWI 🏏🌴 pic.twitter.com/cx1L1swU6e
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
CSK Worst Record: ఐపీఎల్లో చెన్నై చెత్త రికార్డు - 15 సీజన్లలో ఏ జట్టూ చేయని ఘోరమైన ప్రదర్శన!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !