EV Conversion Kits: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చవచ్చా? ఎంత ఖర్చవుతుంది?
పాత డీజిల్ కార్లు ఎలక్ట్రిక్ కిట్‌లతో తిరగడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మరి ఈ ప్రాసెస్‌కు ఎంత ఖర్చవుతుంది?
10 సంవత్సరాల పైబడిన పాత డీజిల్ కార్లు ఎలక్ట్రిక్ కిట్‌లతో తిరగడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఇన్‌స్టాల్ చేయడం సులభమా? కష్టమా? ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా? అనే విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్‌స్టాలేషన్ కొన్ని కార్లకు చాలా ఎక్కువ సమయం తీసుకోనుంది. అయితే సమయం పడితే పట్టింది కానీ.. దాన్ని ఇన్‌స్టాల్ చేయడం సులభమా అనేది ప్రశ్నగా మారింది. ఉదాహరణకు నార్త్‌వే మోటార్ స్పోర్ట్ అనే సంస్థ డిజైర్ వంటి పాపులర్ కార్లకు ఎలక్ట్రిక్ కిట్‌లను ఆఫర్ చేస్తుంది.
అయితే ఇక్కడ ప్రశ్నేంటంటే.. కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడం సులభమా.. ఈవీ కిట్ కన్వర్షన్ తయారీదారులు మాత్రం ఇంజిన్ తీసి ప్లగ్ ఇన్ చేయడం చాలా సులభం అంటున్నారు. కొన్ని అవసరమైన విడిభాగాలు ఇందులోనే ఉండనున్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ బాక్స్ వంటివి అలానే ఉంటాయి.
వీటి రేంజ్, కాస్ట్ ఎంత ఉండనుంది అనేది కూడా ప్రశ్నే. సాధారణంగా ఎలక్ట్రిక్ కిట్లు 200 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తాయి. ఇవి సాధారణంగా నగరాల్లో రోజువారీ వినియోగానికి సరిపోతాయి. దీన్ని బట్టి చూస్తే టాటా టిగోర్ వంటి ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్‌ను ఈ వాహనాలు అందించనున్నాయి. ఇలా చూసుకుంటే ఈ రేంజ్ మంచిదే అనుకోవచ్చు.
అయితే ఈ కిట్ ధర రూ.5 లక్షల వరకు ఉండనుందని తెలుస్తోంది కాబట్టి పాత కార్లు ఉపయోగించే వారు ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతారా.. లేకపోతే కొత్త కారు కొనడానికి మొగ్గు చూపుతారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు చార్జింగ్ నెట్‌వర్క్‌లు ఎక్కడ ఉంటాయి? ఈవీ కన్వర్షన్ కిట్లను సర్వీసింగ్ చేయించడానికి ఎంత ఖర్చు అవుతుంది వంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!