IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!!
ఐపీవో కేటాయింపులు జరగడం లేదని నిరాశపడుతున్నారా? ఎక్కువ డిమాండున్న షేర్లు దక్కడం లేదా? అందుకు ఓ ప్రత్యామ్నాయ విధానం ఉంది. రాబడి కూడా బాగానే ఉంటోంది మరి!!
![IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!! IPO Allotment Status: Didn't Get Shares After Repeated Applications? Try These Measures IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/03b1280f057c32b26e5d96fd1db583a1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత స్టాక్ మార్కెట్లలో కొత్త కంపెనీల నమోదు వేగవంతమైంది. ఎక్కువ కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. అందులో కొన్ని చక్కని వాల్యుయేషన్, ఫండమెంటల్స్‌తో వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అందరికీ ఐపీవోల్లో కేటాయింపు జరగడం లేదు. మరి అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం!!
వస్తే అదృష్టమే
లేటెంట్ వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, పాలసీ బజార్, సిగాచీ ఇండస్ట్రీస్, నైకా వంటి కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. ఇవన్నీ సూపర్ హిట్టు అయ్యాయి. లేటెంట్, నైకా వంటివి 150 శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఉదాహరణకు రూ.14000 పెడితే దాదాపు 45,000 వరకు రాబడి వచ్చింది. పేటీఎం వంటివి నష్టపోయినా మిగతావి లాభాల్లో ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. కానీ 100 షేర్లకు 500 మంది దరఖాస్తు చేస్తుండటంతో అందరికీ ఐపీవో కేటాయింపులు అవ్వడం లేదు.
ప్రత్యామ్నాయంగా ఫండ్
కేటాయింపులు దక్కని వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. దీనికి ఓ ప్రత్యామ్నాయం ఉంది. అదే 'ఎడిల్‌వీస్ ఐపీవో ఫండ్'. ఇదో థీమాటిక్ మ్యూచువల్ ఫండ్. కొత్తగా వచ్చే ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతుంది. అన్ని రకాలుగా విశ్లేషించి నాణ్యమైన కంపెనీలనే వీరు ఎంచుకుంటారు. 2018 నుంచి ఐపీవోలు 50 శాతం పెరిగాయి. 13 శాతం ఎక్కువ సబ్‌స్క్రైబ్ చేసుకున్న కంపెనీల షేర్లు సగటున 15 నుంచి 50 శాతం ప్రీమియంతో నమోదయ్యాయి. దాంతో ఎడిల్‌వీస్ ఈ ఫండ్‌ను తీసుకొచ్చింది.
మెరుగైన రాబడి
ఎడిల్ వీస్ ఐపీవో ఫండ్ 2018లో ఆరంభించారు. మొదట ఇది క్లోజ్ ఎండెడ్ ఫండ్. నిర్దిష్ట గడుపు పూర్తయ్యాక ఓపెన్ ఎండెడ్ ఫండ్‌గా మార్చారు. ఈ మధ్యే వచ్చిన ఐపీవోల్లో వీరు పెట్టుబడి పెడతారు. అంబర్ ఎంటర్‌ప్రైజెస్, గోల్డ్ బీఎల్‌డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్, గ్లాండ్ ఫార్మా, జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. అయితే ఈ ఫండ్లో సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం ముఖ్యమని ఎడిల్‌వీస్ అంటోంది. చాలామంది ఐపీవో లిస్టైన వెంటనే డబ్బులు తీసేస్తారని, ఎక్కువ రోజులు ఉంచితే రాబడి పెరుగుతుందని పేర్కొంటోంది. నేరుగా ఐపీవోల్లోని రాబడితో పోలిస్తే ఈ ఫండ్లో రాబడి భిన్నంగా ఉంటుంది. సరైన రీతిలో ఫండ్ నిర్వహిస్తే అనేక రెట్లు రాబడి వస్తుంది.
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
Also Read: Audi Q5: ఆడీ క్యూ5 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Also Read: Gold-Silver Price: శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి, తాజా ధరలు ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)