News
News
వీడియోలు ఆటలు
X

UAN-Aadhar Linking: నవంబర్‌ 30 లోపు యూఏఎన్‌, ఆధార్‌ లింక్‌ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు

ఈపీఎఫ్‌ యూఏఎన్‌ను ఆధార్‌ లింక్‌ చేయకపోతే ఇబ్బందులు తప్పవు. నవంబర్‌ 30లోపు అనుసంధానం చేయకపోతే యజమాని వేసే డబ్బులు జమ కావు.

FOLLOW US: 
Share:

మీ ఈపీఎఫ్‌ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (UAN)కు ఆధార్‌ కార్డును అనుసంధానం ఇంకా చేయలేదా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే! నవంబర్‌ 30లోగా యూఏఎన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే కంపెనీ మీ ఖాతాలో జమ చేసే మొత్తం ఆగిపోతుంది. అంతేకాదు, పీఎఫ్‌లోని డబ్బును అవసరానికి విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం కోల్పోతారు. పైగా ఈపీఎఫ్‌వో అందించే అన్ని రకాల సేవలనూ నిలిపివేస్తారు.

ఇలా చేసుకోండి

  • మొదట ఈపీఎఫ్‌వో వెబ్‌పోర్టల్‌ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు లాగిన్‌ అవ్వాలి.
  • మీ యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో మీ అకౌంట్‌కు లాగిన్‌ అవ్వండి.
  • మేనేజ్‌ సెక్షన్‌లోని కేవైసీ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి.
  • పేజీ ఓపెన్‌ అవ్వగానే మీ ఈపీఎఫ్‌వోను ఇతర సేవలకు లింక్‌ చేసే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఆధార్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకొని ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేయండి. మీ పేరు జత చేసి సేవ్‌ కొట్టండి.
  • మీ పొందుపర్చిన సమాచారం అంతా సేవ్ అవుతుంది. యూఐడీఏఐ డేటాతో వెరిఫై చేస్తుంది.
  • కేవైసీలో మీరిచ్చిన సమాచారం సరైందే అయితే ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌తో లింక్‌ అవుతుంది.
  • మీ ఆధార్ వెరిఫై సమాచారం మీ ముందు కనిపిస్తుంది.

యూఏఎన్‌ ఉపయోగాలివీ

ఈపీఎఫ్‌వోలో ఉద్యోగి నమోదు అవ్వగానే అతడు భవిష్యనిధి సభ్యుడు అవుతాడు. అతడికి 12 అంకెల యూఏఎన్‌ (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌) కేటాయిస్తారు. ఈ సంఖ్య సాయంతోనే ఈపీఎఫ్‌వో అన్ని సేవలను మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది. పీఎఫ్‌ ఖాతాను, ఖాతా పుస్తకాన్ని  ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. నామినీ నమోదు చేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌ తెలుసు కదా!

ఈపీఎఫ్‌వో ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం, యజమాని నుంచి 12 శాతం జమ అవుతుందన్న సంగతి తెలిసిందే. యజమాని కోటాలోంచే 3.67 శాతం పీఎఫ్‌ ఖాతాలో జమ అయితే మిగతా 8.33 శాతం ఉద్యోగి పింఛను పథకం (EPS)లోకి వెళ్తుంది.

Also Read: Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి!

Also Read: Electric Flying Taxi: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!

Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!

Also Read: Cryptocurrency Ban: క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి.. బ్యాన్ చేస్తారా? ఏం జరుగుతోంది?

Also Read: Stock Market update: ఎరుపెక్కిన మార్కెట్లు..! సెన్సెక్స్‌ 1687, నిఫ్టీ 509, బ్యాంకు నిఫ్టీ 1,339 పాయింట్లు పతనం

Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ అతిపెద్ద క్రాష్‌..! భయం గుప్పిట్లో క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 27 Nov 2021 01:27 PM (IST) Tags: EPFO Aadhar UAN UAN With Aadhaar November 30

సంబంధిత కథనాలు

Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్‌ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్‌-శ్లోక

Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్‌ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్‌-శ్లోక

New Rules: జూన్‌ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల!

New Rules: జూన్‌ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల!

Gas Cylinder Price: బ్లూ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు, రెడ్‌ సిలిండర్‌ రేటు యథాతథం

Gas Cylinder Price: బ్లూ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు, రెడ్‌ సిలిండర్‌ రేటు యథాతథం

Elon Musk: నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!

Elon Musk: నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!

Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !