Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి!
స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం అవ్వడంతో ఒక్కరోజులోనే రూ.6.5 లక్షల విలువైన ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియెంట్ ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
![Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి! Stock Market Crash 26 Nov 2021 Rs 655000 crore investor wealth lost Sensex below 58000 Nifty 17300 down 300 points Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/22/54ccebf6e62f072ded67c095db114c1d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భయం అంటే ఇదేనేమో! నెగెటివ్ సెంటిమెంట్ అంటే ఇలాగే ఉంటుందేమో! ఒక వార్త లక్షల కోట్ల రూపాయాలకు నష్టం కలిగించడం అంటే ఇదేనేమో!
శుక్రవారం స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం అవ్వడంతో ఒక్కరోజులోనే రూ.6.5 లక్షల విలువైన ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియెంట్ వెలుగుచూడటమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. బి.1.1.529 వేరియెంట్‌గా గుర్తించిన ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వందైనా లేవు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌లో తప్ప మరెక్కడా నమోదవ్వలేదు. కొత్త వేరియెంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పగానే మార్కెట్లు డీలా పడ్డాయి.
మధ్యాహ్నం బెంచ్‌మార్క్ సూచీలన్నీ రెండు శాతానికి పైగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ 1212 పాయింట్లు నష్టపోయి 57,584, నిఫ్టీ 362 పాయింట్లు పతనమై 17,173, బ్యాంక్‌నిఫ్టీ 1000 పాయింట్లు నష్టపోయి 36,370 వద్ద కొనసాగుతున్నాయి. ఇప్పటికే యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల పెంపు, విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడం, ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో భారత మార్కెట్లు డీలాపడ్డాయి. తాజాగా కొత్త వేరియెంట్ వార్త రావడంతో మరింత పతనం అయ్యాయి. దాంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.6.55 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం విలువ రూ.265.66 లక్షల కోట్ల నుంచి రూ.259.11 లక్షల కోట్లుగా మారింది.
మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్, భయాలు చుట్టుముట్టాయని నిపుణులు అంటున్నారు. కొత్త వేరియెంట్‌తో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్లు విధిస్తారేమోనన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా ఏంటా మార్కెట్లు కనీసం 15 శాతం వరకు దిద్దుబాటుకు గురవుతాయని వారు పేర్కొంటున్నారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. మార్కెట్ పడిన ప్రతిసారీ భారీ మొత్తంలో ఫండమెంటల్స్ బలంగా ఉన్న షేర్లు కొనుగోలు చేస్తే మంచి రాబడి వస్తుందని వెల్లడిస్తున్నారు.
Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!!
Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!
Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?
Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!
Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్..! సర్వేలో 54% మంది స్పందన ఇది
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)