Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Mastan Sai In Lavanya Case | ఐఐటీలో బీటెక్ చదివిన మస్తాన్ సాయి సాఫ్ట్ వేర్ జాబ్ చేశాడు. కొత్త కంపెనీ రన్ చేసి లగ్జరీ లైఫ్ కు అలావాటు పడ్డాడు. చివరకు డ్రగ్స్ పెడ్లర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Mastan Sai Drugs Case : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి. మొదట డ్రగ్స్ కేసులో అరెస్టైన మస్తాయి సాయి ఆపై అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మరికొన్ని సెక్షన్లు కేసులో చేర్చారు. యువతులను ట్రాప్ చేసి వారికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు ఇచ్చి వందల మంది నగ్న వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్కులో స్టోర్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు డ్రగ్స్ విక్రయాలతో పాటు అతడికి నిర్వహించిన డ్రగ్స్ టెస్టులోనూ పాజిటివ్ గా తేలింది. రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పాటు డ్రగ్స్ కేసు, అమ్మాయిల వీడియోలు అంటూ మస్తాన్ సాయి చిక్కు్ల్లో ఇరుక్కున్నాడు.
సాధారణంగా డ్రగ్స్ కేసులు, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడనో, సెలబ్రిటీలతో వివాదంలో చిక్కుకుంటోనే అందరి ఫోకస వారిపై ఉంటుంది. ఇంతకీ అతనెవరు అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్న విషయాలు సెర్చ్ చేస్తుంటారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ఏం చేసేవాడు, అతడి బ్యాక్‌గ్రౌండ్ పై ఇంటర్నెట్‌లో చెక్ చేసిన వారు అతడు ఐఐటీయన్ అని తెలిసి షాకవుతున్నారు.
మస్తాన్ సాయి అసలు పేరు..
మస్తాన్ సాయిది అసలు పేరు రవి బావాజి మస్తాన్‌రావు. గుంటూరు జిల్లా మస్తాన్ సాయి స్వస్థలం. అతడి తల్లిదండ్రులు గుంటూరులోనే ఉంటారు. మస్తాన్ సాయి కుటుంబసభ్యులు గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా ఉన్నారు. చదువులో టాలెంటెడ్ అయిన మస్తాన్ సాయి ఐఐటీ కాన్పూర్ లో బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేశాడు. ఆపై సొంతంగా చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ రన్ చేశాడని సమాచారం. ఈ క్రమంలో పబ్‌లకు వెళుతూ లగ్జరీ లైఫ్‌నకు అలవాటు పడిన మస్తాన్ సాయి పార్టీలతో కాలక్షేపం చేసేవాడు. ఆపై డ్రగ్స్ దందా మొదలపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పబ్‌లకు వెళ్తూ మొదట డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టి, ఆపై అదే బిజినెస్ గా మార్చుకుని టాలీవుడ్‌కు చెందిన పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు. రిచ్ పర్సన్‌లా కనిపిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. మరోవైపు కొన్ని సోషల్ అకౌంట్లతో యాక్టివ్ గా ఉంటూ సినిమాల్లో నటించాలని ఆశపడే అమ్మాయిలను ట్రాప్ చేశాడని ఆరోపణలున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో చాట్ చేసి వారికి తెలియకుండానే కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలపడం, డ్రగ్స్ చాక్లెట్లు ఇచ్చి వారిని లోబర్చుకునేవాడు. మత్తులో ఉన్న యువతులను అశ్లీల వీడియోలు తీయడం, వారితో ఏకాంతంగా గడిపిన సమయంలోనూ సీక్రెట్‌గా వీడియోలు రికార్డ్ చేసి స్టోర్ చేశాడు. నగ్న వీడియోలు ఉన్నాయంటూ బ్లాక్‌మెయిల్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేసేవాడు. కొందరు అమ్మాయిల్ని బెదిరించి వారికి తెలియకుండా మళ్లీ వీడియోలు రికార్డు చేసి హార్డ్ డిస్కులో స్టోర్ చేశాడని పోలీసుల విచారణలో ఒక్కో విషయం వెల్లడవుతోంది.
రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్యతో 2022 నుంచి మస్తాన్ సాయికి పరిచయం ఉంది. తనకు తెలియకుండానే మస్తాన్ సాయి డ్రగ్స్ కు అలవాటు చేశాడని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తో తన రిలేషన్ బ్రేక్ కావడానికి కారణం అయ్యాడని.. తనను సైతం లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌తరుణ్ చెప్పాడని లావణ్య వీడియోలను డిలీట్ చేశాడని సమాచారం. ఓ వివాహ వేడుకకు వచ్చిన సమయలో లావణ్యపై లైంగిక దాడికి యత్నించాడని లావణ్య తెలిపింది. చాలా మంది అమ్మాయిల వీడియోలు తీసి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని నార్సింగి పోలీసులకు గత ఏడాది ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గుంటూరు వెళ్లి మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం తెలిసిందే.
Also Read: Mastan Sai Lavanya Case : మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్- సంచలన విషయాలతో రిమాండ్ రిపోర్టు
మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్
డ్రగ్స్ కేసు, నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి కస్టడీ ముగియడంతో రంగారెడ్డి కోర్టు ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు మస్తాన్ సాయిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే కస్టడీ విచారణలో నిందితుడు మస్తాన్ సాయి కీలక విషయాలు బహిర్గతం చేసినట్లు సమాచారం. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో వందల మంది యువతుల అశ్లీల వీడియోలను పోలీసులు గుర్తించారు. పార్టీలో కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి, వారు మత్తులోకి జారుకున్నాక నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. వారి పేర్లతో ఫోల్డర్‌స్ క్రియేట్ చేసి.. వాటితో బెదిరింపులకు పాల్పడి కొందరిపై అత్యాచారానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి ఇంట్లోనూ పార్టీలు జరిగేవని, అవి డ్రగ్స్ పార్టీలేనా.. అయితే ఎవరెవరు వచ్చేవారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషాతో పాటు టాలీవుడ్ హీరో నిఖిల్ సైతం ఈ కేసులో చిక్కుకున్నాడు. వీరి వీడియోలు సైతం మస్తాన్ సాయి వద్ద ఉండటంతో ఈ కేసు కలకలం రేపుతోంది. మరోవైపు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం ఎలాగూ ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

