Electric Flying Taxi: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!
ఈసారి ఒలింపిక్స్‌కు ఎగిరే కార్లు సిద్ధం కానున్నాయి! మరో మూడేళ్లలో ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ టాక్సీ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు వాటిలోనే రావొచ్చు.
ఆకాశమార్గంలో మనకు నచ్చిన ఓ ఎయిర్ టాక్సీని అద్దెకు తీసుకొని విహరిస్తుంటే ఎంత బాగుంటుందో కదా! త్వరలోనే ఈ కల నిజం కానుంది. మరికొన్ని నెలల్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను ఫ్రాన్స్ పరీక్షించనుంది. 2024 ఒలింపిక్స్‌కు ప్రయాణికులను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేకమైన మార్గాలను సృష్టించనుంది. ప్యారిస్ చార్లెస్ డి గాలె నుంచి లి బొర్జెట్ ఎయిర్‌పోర్ట్స్‌కు ఒక ఒకటి, ప్యారిస్ నుంచి రెండు సబ్‌అర్బన్ ప్రాంతాలను కలపుతూ మరో మార్గాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ ఏడాది మొదట్లో పొంటిస్ కార్మెల్లిస్ ఎన్ వెక్సిన్ హబ్ ఎలక్ట్రిక్ ట్యాక్సీల టేకాఫ్, ల్యాండింగ్ జోన్లను పరీక్షించింది. ఇక వోలొకాప్టర్, ఎయిర్‌బస్ ఎస్‌ఈ, వెర్టికల్ ఎయిరోస్పేస్ గ్రూప్, లిలియమ్ ఎన్‌బీ, జోబీ ఏవియేషన్‌తో పాటు ఫ్రాన్స్ పౌర విమానయాన శాఖ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి.
ఈ సరికొత్త రవాణా విపణికి బూమ్ రావడంతో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు యజమానులు, ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. లిలియమ్‌తో పాటు బ్రిటన్‌కు చెందిన వెర్టికల్ ఎయిరోస్పేస్, జర్మనీకి చెంది వోలొకాప్టర్ ఆర్డర్ల కోసం విపరీతంగా పోటీ పడుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని నగరాల్లో ఈ ప్రాజెక్టులపై అర్బన్ ఎయిర్‌పోర్ట్, హ్యూందాయ్ మోటార్ వంటి కంపెనీలు దృష్టి పెట్టాయి. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎగిరే టాక్సీలను పరీక్షించేందుకు రోమ్ సైతం సిద్ధమవుతోంది.
Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!!
Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!
Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?
Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!
Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్..! సర్వేలో 54% మంది స్పందన ఇది
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
Also Read: Audi Q5: ఆడీ క్యూ5 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి