Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ అతిపెద్ద క్రాష్..! భయం గుప్పిట్లో క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ
శుక్రవారం బిట్‌కాయిన్ ధర ఏకంగా 8 శాతం తగ్గిపోయింది. బిట్‌కాయిన్ రూ.42,93,483 వద్ద కొనసాగుతోంది. ఇక ఎథిరెమ్ సైతం 7.62 శాతం నష్టపోయి రూ.3,19,848 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమైనా కరోనా కొత్త వేరియెంట్ ఇటు క్రిప్టో కరెన్సీ మార్కెట్‌నూ కలవరపెట్టింది. దీంతో శుక్రవారం బిట్‌కాయిన్ ధర ఏకంగా 8 శాతం తగ్గిపోయింది. కొత్త వేరియెంట్ వ్యాక్సిన్‌కు లొంగదని భావించి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫలితంగా బిట్‌కాయిన్ అక్టోబర్ 12 తర్వాత అతిపెద్ద కుదుపునకు లోనైంది.
శుక్రవారం సాయంత్రం నాటికి బిట్‌కాయిన్ రూ.42,93,483 వద్ద కొనసాగుతోంది. ఇక ఎథిరెమ్ సైతం 7.62 శాతం నష్టపోయి రూ.3,19,848 వద్ద ట్రేడ్ అవుతోంది. బైనాన్స్ కాయిన్ 9.38 శాతం తగ్గి రూ.45,686, సొలానా 9.34 శాతం పడిపోయి రూ.14,953, రిపుల్ 9.20 శాతం తగ్గి రూ.74.82, కర్డానో 8.30 శాతం తగ్గి రూ.121, టెథెర్ 0.07 శాతం పెరిగి రూ.79.67 వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఎయిర్‌స్వాప్, అవలాంచె, లూప్‌రింగ్, కాస్మో్, కర్వ్‌డావో, పవర్ లెడ్జర్, ఠీటా నెట్‌వర్క్ వంటివి 14 నుంచి 19 శాతం వరకు నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!!
Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!
Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?
Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!
Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్..! సర్వేలో 54% మంది స్పందన ఇది
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి