X

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

భారతదేశంలో రెనో క్విడ్ సేల్స్ నాలుగు లక్షల మైలురాయిని దాటాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ర్యాలీని నిర్వహించారు.

FOLLOW US: 

భారతదేశంలో 4 లక్షల సంచలన మైలురాయిని ఇటీవలే దాటిన రెనో క్విడ్‌, మినీ-కార్ల విభాగంలో ప్రధాన శ్రేణిలో నిలుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ మైలురాయిని హైదరాబాద్‌లో క్విడ్‌ యజమానులతో కలిసి రెనో జరుపుకుంది. ఈ సందర్భంగా రెనో క్విడ్‌ మైలేజీ ర్యాలీ కూడా నిర్వహించారు. మొత్తం 100 కి.మీ దూరం సాగిన ఈ ర్యాలీ హైటెక్ సిటీలోని హోటల్ ర్యాడిసన్‌లో ప్రారంభం అయింది.

ప్రస్తుత క్విడ్‌ కస్టమర్లు మ్యాగ్జిమం మైలేజీ పొందాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకకు అనూహ్యమైన స్పందన లభించింది. 30 మందికి పైగా వినియోగదారులు ఇందులో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. ర్యాలీ లీటరుకు 32.5 కిలోమీటర్ల అత్యుత్తమ సగటు మైలేజీని అందించిందని పేర్కొంది.

అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు, పనితీరును దృష్టిలో ఉంచుకొని భారతీయ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసి రూపొందించిన వాహనం రెనో క్విడ్‌ అని తెలిపింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పాలసీని ఇది బలంగా ప్రతిధ్వనింపజేస్తుందని పేర్కొంది. భారతీయ అనుభవం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయంగా సమర్థవంతమైన ఉత్పత్తులను భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచానికి అందించేందుకు ఇది కృషి చేస్తుంది.

ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌టీ, క్లైంబర్‌ వేరియంట్స్‌లో 0.8 లీటర్లు, 1.0 లీటర్ల ఎస్‌సీఈ మ్యానువల్‌, ఏఎంటీ ఆప్షన్స్‌‌తో మొత్తంగా తొమ్మది ట్రిమ్స్‌లో అందుబాటులో ఉన్న రెనో క్విడ్‌, భారతదేశంలో రెనో బ్రాండ్‌ ఎదుగుదలలో కీలకంగా నిలుస్తోంది. ఎస్‌యూవీ ఇన్‌స్పిరేషన్‌తో రూపొందిన డిజైన్‌, మొట్టమొదటిసారిగా 20.32 సెం.మీటర్ల టచ్‌ స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లేతో కూడిన మీడియానేవ్, ఫ్లోర్‌ కన్సోల్‌ మౌంటెడ్‌ ఏఎంటీ డయల్‌ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను శ్రమలేకుండా చేస్తున్నాయి.

10వ వార్షిక వేడుకల సందర్భంగా రెనో ఇటీవలే క్విడ్‌ ఎంవై 21ను లాంచ్‌ చేసింది. భారతదేశంలో వర్తించే అన్ని సేఫ్టీ నిబంధనలకు కట్టుబడి ఉండే  ఎంవై21  అన్ని వేరియంట్స్‌లో డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌ ఫీచర్స్‌ను అందించారు. కారు ఆకర్షణను మరింత పెంచేందుకు ఎంవై21 క్లైంబర్‌ ఎడిషన్‌లో డ్యూయల్‌ టోన్‌ వైట్‌ అండ్‌ బ్ల్యాక్‌ ఎక్స్‌టీరియల్‌ కాంబినేషన్‌తో పాటు ఎలక్ట్రిక్‌ ఓఆర్‌వీఎం, డే, నైట్‌ ఐఆర్‌వీఎం ఉన్నాయి. ముందు భాగంలో డ్రైవర్‌ సైడు ఉండే పైరోటెక్‌, ప్రీటెన్షనర్‌ వాహన భద్రతను మరింత పెంచుతాయి. క్విడ్‌ కస్టమర్లు అందరికీ స్పేర్‌ పార్టులు, విడిభాగాలపై 10 శాతం డిస్కౌంట్‌, లేబర్‌ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ సహ అనేక స్పెషల్‌ ఆఫర్లను రెనో ప్రకటించింది.

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Renault Renault Kwid Sales Record Renault Kwid Mileage Renault Kwid Sales Renault Kwid Record Renault Kwid Renault Kwid New Variant

సంబంధిత కథనాలు

2022 Maruti Suzuki Baleno: రూ.6 లక్షల్లో మారుతి సుజుకి కొత్త కారు.. బలెనో కొత్త వేరియంట్ వచ్చేస్తుంది!

2022 Maruti Suzuki Baleno: రూ.6 లక్షల్లో మారుతి సుజుకి కొత్త కారు.. బలెనో కొత్త వేరియంట్ వచ్చేస్తుంది!

Kia Carens: కియా కారెన్స్ లాంచ్ అయ్యేది అప్పుడే.. మొదటి రోజు ఎన్ని బుక్ చేసుకున్నారంటే?

Kia Carens: కియా కారెన్స్ లాంచ్ అయ్యేది అప్పుడే.. మొదటి రోజు ఎన్ని బుక్ చేసుకున్నారంటే?

XUV700 Deliveries: దేశంలో మోస్ట్ వాంటెడ్ కారు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

XUV700 Deliveries: దేశంలో మోస్ట్ వాంటెడ్ కారు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Self Driving Vehicles: ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు.. త్వరలో తీసుకురానున్న ప్రముఖ బ్రాండ్!

Self Driving Vehicles: ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు.. త్వరలో తీసుకురానున్న ప్రముఖ బ్రాండ్!

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

టాప్ స్టోరీస్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!