Nara Bhuvaneswari: వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం
Floods In Telugu States: కష్టాల్లో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు హెరిటేజ్ ఫుడ్స్ అండగా నిలిచింది. ఆ సంస్థ ఎండీ రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు.
![Nara Bhuvaneswari: వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం Chandrababu wife Nara Bhuvaneshwari announced two crore rupees donation to Andhra Pradesh and Telangana CM Relief Fund to support the flood victims Nara Bhuvaneswari: వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/04/838515174bc9765a20dbdada1221d4ae1725422368652215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh And Telangana : వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు అన్ని రంగాల్లోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు, తెలంగాణ సీఎం సహాయనిధికి మరో కోటి రూపాయల చొప్పిన హెరిటేజ్ ఫుడ్స్ తరఫున విరాళం ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఆ ప్రకటనలో ఏం చెప్పారంటే... ఈ మధ్య కురిసిన భారీ వర్షాలు, ముంచిన వరదలకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయ చర్యలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాన కార్యక్రమాలు చేపట్టేందుకు మా వంతు సాయం అందజేస్తామన్నారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందని వివరించారు భువనేశ్వరి. అందుకే చెరో కోటి రూపాయలు అందజేయనున్నట్టు ప్రకటించారు.
At Heritage Foods, we believe in standing by our communities, especially in times of crisis. The recent floods in Andhra Pradesh and Telangana have impacted many lives, and we are committed to supporting the State's efforts in providing relief and rebuilding the affected areas.…
— Nara Bhuvaneswari (@ManagingTrustee) September 4, 2024
Also Read: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం
టీజీ భరత్ పది లక్షల సాయం
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సాయం ప్రకటించారు. టీజీవీ గ్రూప్ తరఫున ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల రూపాయలు అందజేయనున్నట్టు వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కళ్లం రాజశేఖర్‌రెడ్డి, కొమ్మారెడ్డి కిరణ్ అనే వ్యాపారవేత్తలు పది లక్షల రూపాయలను మంత్రి నారాలోకేష్‌కు అందజేశారు.
Also Read: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు కూడా ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారి అసోసియేషన్ తరఫున ఒకరోజు జీతాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సుమారు కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
Also Read: ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్, సిద్ధూ, నిర్మాతలు... వరద బాధితుల సహాయార్థం ఎవరెంత విరాళం ఇచ్చారంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)