YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
Andhra Pradesh News | ఏపీలో వరద బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. వైసీపీ తరఫున కోటి రూపాయలు ఇస్తున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
![YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా? YS Jagan Mohan Reddy announces Rs 1 crore Donation For Flood Victims in Vijayawada YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/03/d3d37a87181292ec3723e97f421e06481725370829838233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Jagan announces Rs 1 crore Donation For Flood Victims | తాడేపల్లి: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని వైఎస్సార్‌సీపీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం (సెప్టెంబర్ 3న) సమీక్షించారు. అందుబాటులో ఉన్న వైసీపీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా (NTR District) పార్టీ శ్రేణులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని జగన్ కు పార్టీ నేతలు వెల్లడించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జగన్ కు తెలిపారు.
చంద్రబాబు చుట్టూ అధికార యంత్రాంగం..
ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ పర్యటిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అధికార యంత్రాంగమంతా చంద్రబాబుతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందన్నారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని విమర్శించారు. చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ వివరించారు. కాగా, నిన్న (సోమవారం) తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న జగన్, బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనే విజయవాడకు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలకు సహాయం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలని సూచించారు.
వరద బాధితులకు కోటి రూపాయల సాయం..
— YSR Congress Party (@YSRCParty) September 3, 2024
పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు నిర్ణయం
తాడేపల్లి:
కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్… pic.twitter.com/svDoVqvZr4
పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం
వరద బాధితుల కోసం పార్టీ తరపున వైసీపీ అధినేత జగన్ కోటి రూపాయల సాయం ప్రకటించారు. కోటి రూపాయల సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నేతలతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, మెరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నేత షేక్ ఆసిఫ్ వైఎస్ జగన్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: వరదలోనే మహిళ ప్రసవం, తల్లీబిడ్డలను సేఫ్‌గా తీసుకొచ్చిన నగర పోలీసులు
Also Read: Andhra Pradesh Floods: కుట్రలు జరుగుతున్నాయేమో- చంద్రబాబు సంచలన కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)