ఏపీలో రంగంలోకి దిగిన NDRF, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు NDRF సిబ్బంది విజయవాడలో డ్రోన్ల ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, ముంపు ప్రాంత బాధితులకు సాయం చేస్తున్నారు వరద ముంపు ప్రాంతాలు కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బుడమేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో విజయవాడలో లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు వరద బాధితులకు ఎప్పటికప్పుడూ అవసరమైన సరుకులు అతికష్టమ్మీద చేరవేస్తున్నారు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో 192 మందిని రక్షించిన 9వ బెటాలియన్ ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు, అత్యవసర మందుల కిట్లను హెలికాప్టర్ లో లోడ్ చేస్తున్నారు వాటిని విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రెస్క్యూ టీమ్ చేరవేస్తోంది ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని చంద్రబాబు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు