3,303 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ భారతదేశం మొత్తం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. మువ్వన్నెల జెండాను ఎగురవేసి, ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల్ని స్మరించుకుందాం ప్రధాని నరేంద్ర మోదీ ‘హర్ గర్ తిరంగా’ కార్యక్రమానికి గతంలో శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగుర వేయాల్సి ఉంటుంది విజయవాడలో ఏకంగా 3303 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేశారు సితార సెంటర్ లేబర్ కాలనీలో ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు సితార సెంటర్ మీదుగా సొరంగం, కేఎబీఎన్ కాలేజీ మీదుగా పంజా సెంటర్ వరకు జెండాను ప్రదర్శించారు ఎంపీ కేశినేని చిన్ని జాతీయ జెండా ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు.