కనక దుర్గ దేవాలయం ఇంద్రకీలాద్రి కొండపైన ఉంది. దసరాలో వెళ్తే పండుగ వాతావరణమే. కనక దుర్గ దేవాలయం RTC బస్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లే.
500 అడుగుల ఎత్తులో ఉన్న గాంధీ కొండపై దేశంలోనే 7స్థూపాలతో కూడిన తొలి గాంధీ స్మారకాన్ని నిర్మించారు. 52అడుగుల స్థూపాన్ని 1968 అక్టోబర్ 6న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆవిష్కరించారు.
దీన్ని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అత్యంత సుందరంగా అభివృద్ధి చేసింది. మినీ జూ, వాటర్ ఫౌంటెన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు
మొగల్రాజపురం గుహలు విజయవాడ నగరం నడిబొడ్డున కస్తూరిబాయిపేట, మొగల్రాజపురం వద్ద ఉన్నాయి. మొగల్రాజపురం గుహల్లో నటరాజ, వినాయక, అర్థనారీశ్వర విగ్రహాలు చూడవచ్చు.
సెయింట్ మేరీ చర్చి విజయవాడకు తూర్పు వైపున గుణదలలో రాతి కొండపై ఉంది. ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక అందరినీ ఆకర్షిస్తుంది. ఇది RTC బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కృష్ణా నది మధ్యలో 130 ఎకరాల విస్తీర్ణంలో భవానీ ద్వీపం ఉంది. పడవలో ద్వీపానికి ప్రయాణం చాలా ఆహ్లాదకరమైన అనుభవం. అనుమతి తీసుకొని సమావేశాలు, వివాహాలు నిర్వహించవచ్చు.
ఈ మ్యూజియంలో క్వీన్ విక్టోరియా పురాతన శిల్పాలు, పెయింటింగ్, విగ్రహాలు, ఆయుధాలు, శాసనాలు చూడొచ్చు. ఇది బందర్ రోడ్డులో ఉంది.
విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధేంద్ర యోగి జన్మస్థలం. ఇక్కడ ఉన్న కూచిపూడి నృత్య పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది.
మచిలీపట్నం సమీపంలో ఉన్న ఈ బీచ్ లక్షల మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పాండురంగ స్వామి దేవాలయం ఉంది.
కృష్ణానది సముద్రంలో కలిసే ప్రత్యేక ప్రదేశం. దీన్ని చూసేందుకు రోజూ వందల మంది పర్యాటకులు వస్తుంటారు.
కృష్ణా నదికి అడ్డంగా నిర్మించి ప్రకాశం బ్యారేజీ 1223.5 మీటర్ల పొడవు ఉంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ బ్యారేజీ మంచి పర్యాటక ప్రాంతం.