News
News
X

AIIMS Study: 4 నిమిషాలకో మరణం - ఇండియాను వణికిస్తున్న ప్రాణాంతక సమస్య, కలవరపెడుతోన్న ఎయిమ్స్ స్టడీ

బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకం. ఇది రావడానికి ముందు కనిపించే లక్షణాలు గుర్తించి వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

FOLLOW US: 
Share:

భారతదేశంలో గుండె పోటు తర్వాత ఎక్కువ మంది స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు స్ట్రోక్ వల్ల మరణిస్తున్నారని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) న్యూరాలజిస్ట్ వెల్లడించారు. భారత్ లో ప్రతి సంవత్సరం 1,85,000 స్ట్రోక్స్ సంభవిస్తున్నాయి. దాదాపు ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్ సంభవిస్తుంది. గ్లోబల్ బర్డేన్ ఆఫ్ డిసీజెస్(GBD) ప్రకారం మన దేశంలో 68.6 శాతం స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. 70.9 శాతం స్ట్రోక్ మరణాలు సంభవిస్తుంటే 77.7 శాతం మంది స్ట్రోక్ వల్ల వికలాంగులుగా మారి మంచానికే పరిమితం అవుతున్నారు. స్ట్రోక్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా పేదలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

చిన్న, మధ్య వయసు వారిలో స్ట్రోక్ భారం ఎక్కువగా ఉంటుంది. జీబీడీ విశ్లేషణ ప్రకారం 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో 31 శాతం స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు తెలిపారు. స్ట్రోక్ బాధితులకు సమర్థవంతమైన చికిత్స అందించేందుకు సరైన మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగా ఆసుపత్రుల్లో స్ట్రోక్ సేవలు చాలా దారుణంగా ఉన్నాయని న్యూరాలజిస్ట్ తెలిపారు. స్ట్రోక్ ప్రాణాంతకం కావచ్చు. లేదా పక్షవాతానికి దారితీస్తుంది. స్ట్రోక్ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రోగికి చికిత్స అందించాలి ఆ తర్వాత న్యూరాన్ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రోక్ అంటే ఏంటి? ఎన్ని రకాలు?

స్ట్రోక్ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు సంభవిస్తుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడం, రక్తం, ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. న్యూరాలజీ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డిప్రెషన్ స్ట్రోక్ తో ముడి పడి ఉందని తెలిపారు. డిప్రెషన్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే అదే డిప్రెషన్ స్ట్రోక్ తర్వాత కోలుకునేలా చేస్తుందని కూడా అంటున్నారు. కోవిడ్ తో పాటి స్ట్రోక్ కేసులు పెరుగుతూ వచ్చాయి. యూఎస్ లోని థామస్ జెఫేర్సన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం కోవిడ్ తో బాధపడుతున్న వ్యక్తులు, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కోలుకోవడం కష్టంగా ఉంటుందని తెలిపారు.

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మరొక కారణం హైబీపీ. అందుకే రక్తపోటు అదుపులో ఉండేలా చూసుకోవాలి. స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి ఇస్కిమిస్క్ స్ట్రోక్ రెండోది హేమరెజిక్ స్ట్రోక్. రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకి రక్త సరఫరా నిలిచిపోతే ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. రక్తనాళం పగిలిపోవడం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. వీటిలో ఎక్కువ మంది ఇస్కిమిక్ స్ట్రోక్ బారిన పడుతున్నారు.

స్ట్రోక్ లక్షణాలు

స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు కొన్ని తీవ్రంగా ఉంటాయి. మాట్లాడలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, నోరు పడిపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: అతిగా నీళ్లు తాగినా కిడ్నీలు దెబ్బతింటాయ్ - రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Published at : 10 Mar 2023 11:01 AM (IST) Tags: Depression Brain stroke Brain Storke Symptoms Stroke Deaths

సంబంధిత కథనాలు

కేరళలోని ఈ ప్రత్యేక వేడుకలో పురుషులంతా మహిళల్లా తయారవుతారు

కేరళలోని ఈ ప్రత్యేక వేడుకలో పురుషులంతా మహిళల్లా తయారవుతారు

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Idly Day: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?

World Idly Day: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?

నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?

నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?

ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే

ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు