By: ABP Desam | Updated at : 10 Sep 2022 11:28 AM (IST)
image credit: pixabay
మన శరీరం కాల్షియం, ఫాస్ఫేట్‌ను గ్రహించి కండరాలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచాలంటే విటమిన్ డి (Vitamin D) కావాలి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి ఇది దోహదం చేస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారు తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ తో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో చాలా మంది కోవిడ్ నుంచి రక్షణగా ఉండేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కోవిడ్ బారిన పడకుండా రక్షిస్తుందని కొంతమంది నమ్మారు. అవి శరీరానికి అవసరం అని భావించి అధికంగా తీసుకోవడం ప్రారంభించారు. అయితే నిజంగానే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చా? నిపుణులు ఏమని చెప్తున్నారు?
ఇది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు కొట్టి పారేశారు. విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం వలన అటువంటి ప్రయోజనం ఏమి ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం విటమిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ కోవిడ్-19 లేదా మరేదైనా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా నిరోధించలేమని రెండు కొత్త పెద్ద క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి. యుకే నుంచి వచ్చిన ఒక నివేదిక మహమ్మారి విస్తృతంగా ఉన్నప్పుడే దీనిపై పరిశోధనలు జరిపారు.
విటమిన్ డి తగినంత స్థాయిలో లేని 3,100 మందికి విటమిన్ సప్లిమెంట్స్ తక్కువ లేదా అధిక మోతాదులో అందించారు. ఈ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కరోనా వైరస్ లేదా ఇతర శ్వాసకోస ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుందో లేదో పరిశీలించారు. అదే సమయంలో మరో ప్రదేశంలో కూడా దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. COVID నివారణపై విటమిన్ డి ఏదైనా ప్రభావం చూపిస్తుందో లేదో పరీక్షించడానికి దాదాపు 34,000 మంది నార్వేజియన్లకు కాడ్ లివర్ ఆయిల్ లేదా ప్లేసిబోను అందించారు.
ఏం తేలింది?
విటమిన్ డి సప్లిమెంట్స్ అధిక మోతాదు, తక్కువ మోతాదులో ఇవ్వడంతో పాటు కాడ్ లివర్ ఆయిల్ వల్ల కూడా కరోనా వైరస్ ప్రమాదాన్ని తగ్గించలేదని నిర్ధారించారు. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళలో కోవిడ్ నివారించే పరిస్థితులు కనిపించలేదని అధ్యయనాలు వెల్లడించాయి. విటమిన్ డి కంటే టీకాలు వేయడం వల్ల కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని స్పష్టం చేశారు. ఇవే కాదు యునైటెడ్ స్టేట్స్, కెనడాలో జరుగుతున్న మరో రెండు క్లినికల్ ట్రయల్స్ కూడా కోవిడ్ ని నియంత్రించడంలో విటమిన్ డి సప్లిమెంట్స్ ఎటువంటి ప్రభావం చూపలేవని వెల్లడించాయి.
పరిశోధన ప్రకారం విటమిన్ డి లోపం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. విటమిన్ సి మాదిరిగా కాకుండా విటమిన్ డి కొవ్వులో కరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం పాటు సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల అది విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: చచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించండి
Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?
Harmful Symptoms : మీ శరీరంలో ఈ మార్పుల సంకేతం అదే.. అస్సలు అశ్రద్ధ చేయకండి
Winter food: చలికాలంలో తినకూడని కొన్ని ఆహారాలు ఇవిగో
Hair Oil: తలకు నూనె రాసుకోకపోతే వెంట్రుకలకు నష్టమే
Papaya: బొప్పాయిని తిన్నాక ఈ ఆహారాలను తినకండి, మంచిది కాదు
Eat Tomatoes Everyday : రోజూ టమోటాలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎవరు తినకూడదు?
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
/body>