Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 22nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఫుల్లుగా తాగేసి దిగు దిగు నాగ అంటూ లక్ష్మీ డ్యాన్సులు.. మత్తులో ఉన్న లక్ష్మీని రోహిత్ ఏం చేస్తాడు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనక మహాలక్ష్మీతో అంబిక మందు తాగించడం లక్ష్మీ మత్తులో ఉండగా స్వీటీ లక్ష్మీని రోహిత్‌కి అప్పగించాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక సుభాష్‌తో మాట్లాడుతుంది. పార్టీ ఎంజాయ్ చేస్తున్నావా అని సుభాష్ అంబికను అడిగితే నేను వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు విహారి పతనం చూడటానికి అని చెప్తుంది. రౌడీలతో మాట్లాడేశా అని చెప్తుంది. ఇక సుభాష్ అంబికకు ప్లాన్ అడిగితే అంబిక చెప్తుంది. సుభాష్ తాను కూడా రౌడీలతో కలిసి అక్కడికి వచ్చి ప్లాన్‌లో పాల్గొంటాను అని అంటాడు.
సుభాష్: ఈ రోజులో విహారి పని అయిపోతుంది. కంపెనీలోనూ మనదే ఆధిపత్యం అవుతుంది. హ్యాపీగా ఉండు.
అంబిక: విహారి ఈ రోజుతో నీ అడ్డు తొలగించుకోబోతున్నా మళ్లీ కంపెనీ అధికారం నాదే.
అంబిక లక్ష్మీని చూసి అందరి దృష్టి మళ్లాలని అందుకు ఒక బకరా కావాలని అనుకొని లక్ష్మీని ఎంచుకుంటుంది. అందుకు కూల్ డ్రింక్‌లో మందు కలిపేసి లక్ష్మీకి ఇప్పిస్తుంది. లక్ష్మీ నార్మల్ డ్రింక్ అనుకొని మందు తాగేస్తుంది. అంబిక దూరం నుంచి చూసి నవ్వుకుంటుంది. మళ్లీ మళ్లీ లక్ష్మీతో తాగించేస్తుంది. లక్ష్మీ డ్రింక్ తాగి మత్తులోకి వెళ్లిపోతుంది. ఇక సుభాష్ రౌడీలతో కలిసి పార్టీ దగ్గరకు వస్తుంటారు. అంబిక లక్ష్మీ దగ్గరకు వచ్చి కావాలనే లక్ష్మీని నెట్టేస్తుంది. మైకంలో లక్ష్మీ అంబికను కొట్టి ఎవరే నువ్వు నన్నే గుద్దుకుంటూ వెళ్లిపోతున్నావ్ కళ్లు కనిపించడం లేదా ఏంటే లేవవే అని కొడుతుంది. లక్ష్మీ అంబిక గొంతు పట్టుకుంటుంది.
సహస్ర వచ్చి లక్ష్మీ ఏం చేస్తున్నావ్ అంటే లక్ష్మీ మీ ఇద్దరి అంతు తేల్చేస్తా అని ఇద్దరి గొంతు నలిపేస్తుంది. ప్రతీ దానికి నేను దొరికానా నన్నే టార్గెట్ చేస్తున్నారు. మీ ఇద్దరికీ నాలో తప్పులు ఎంచడం తప్ప ఇంకేం తెలీదా. మీ ఇద్దరికీ నేను ఎలా కనిపిస్తున్నానే అని గొంతు నులిపేస్తుంది. మత్తులో ఇద్దరికీ ఫుల్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇంతలో విహారి వచ్చి లక్ష్మీని ఆపాలని ప్రయత్నిస్తాడు. విహారి ఎంత చెప్పినా లక్ష్మీ వినదు. వీళ్లు నీచులు వీళ్లని వదలకూడదు అని తిడుతుంది. విహారి బలవంతంగా లక్ష్మీని లాగడంతో లక్ష్మీ విహారి మీద పడిపోతుంది. విహారి లక్ష్మీని లేవమని అంటే నేను ఎందుకు లేవాలి నేను మీ మాట వినను అని అంటుంది. సహస్ర చూసి షాక్ అయిపోతుంది. అంబిక, సహస్ర ఇద్దరూ బలవంతంగా లక్ష్మీని పైకి లాగుతారు. ఏం తాగావే అని సహస్ర లక్ష్మీని అడుగుతుంది. నేను తాగలేదు డ్రింక్ తాగాను అందులో ఏదో ఉందని అంటుంది.
ఇక సహస్ర ఫ్రెండ్స్ గొడవ వద్దు మూజిక్ పెట్టండి అంటే లక్ష్మీ దిగు దిగు నాగ దివ్యా సుందర నాగా అని డ్యాన్స్ వేస్తుంది. సహస్ర, అంబిక, విహారి అందరినీ లాగుతూ డ్యాన్స్ చేస్తుంది. ఇక లక్ష్మీ డ్యాన్స్ చేసి చేసి పడిపోతుంది. విహారి పట్టుకొని వేరే వాళ్లకి లక్ష్మీని అప్పగించి బెడ్ మీద పడుకోపెట్టమని అంటాడు. సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మీని తీసుకెళ్తారు. గదిలో పడుకోపెడతారు. ఇక సహస్ర, అంబికలు లక్ష్మీ చాలా డేంజరస్‌గా ఉందని అనుకుంటారు. ఇక స్వీటీ లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీని రోహిత్‌కి అప్పగించాలని అనుకుంటుంది. అందుకు లక్ష్మీని తీసుకెళ్లి వేరే గదిలో పడుకోపెడుతుంది. తర్వాత రోహిత్‌కి మెసేజ్ చేస్తుంది. సహస్ర ఫ్రెండ్ వెళ్లిపోతామని చెప్తారు. ఇక విహారి కూడా వెళ్లిపోదాం అంటాడు. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందని అంబిక సుభాష్‌ని తిట్టుకుంటుంది. ఇక లక్ష్మీని తీసుకొద్దామని విహారి, అంబిక వెళ్తారు. గదిలో లక్ష్మీ ఉండదు. మొత్తం చూస్తారు లక్ష్మీ కనిపించదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

