Satyabhama Serial Today January 22nd: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!
Satyabhama Today Episode సత్య నందిని కలిసి క్రిష్‌తో అజ్ఞాత వ్యక్తి అంటూ ఆడుకోవడం సత్యకి సపోర్ట్ చేస్తూ క్రిష్ ఫొటోలు తీయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode నందిని సత్యకి ఫోన్‌లో ఫొటోలు తీస్తుంటుంది. భైరవి అక్కడికి వచ్చి నిల్చొంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్ వదినకు దిష్టి తగులుతుంది అని నందిని అంటుంది. దానికి భైరవి ఓడిపోవడానికి ఇవన్నీ ఎందుకే నవ్వుతూ ఫోజులు పెట్టడం కాదు అని ఏడుస్తూ కొంగు చాచినట్లు అడ్డుకున్నట్లు భైరవి ఫోజులిస్తుంది. ఆ స్టిల్స్ సత్య తన ఫోన్‌లో తీసుకుంటుంది. భైరవి సత్యతో నా భర్త గెలిచాక మామయ్య దెబ్బ కోడలి అబ్బా అని పోస్టర్లు అతికిస్తాను అంటుంది. దానికి సత్య తాను తీసిన ఫొటోలు అత్తకి చూపించి తాను గెలిచాక వాటిని పోస్టర్లులో అతికిస్తాను అంటుంది.
ఇక క్రిష్ సత్య వాళ్ల దగ్గరకు వచ్చి పోస్టర్లకు ఇలాంటి ఫొటోలు తీస్తే ఎవరూ దేకరని తన తండ్రికి ఏ రేంజ్లో ఫొటో షూట్ ఏర్పాటు చేశానో చూడమని చెప్తాడు.. గెలిచే వారి సత్తా ఎలా ఉంటుందో వచ్చి చూడండి అంటాడు.
క్రిష్: మనసులో ఇప్పుడు సత్య రెచ్చిపోతుంది. వెనక నుంచి సపోర్ట్ చేస్తా.
నందిని: వాడి మాటలు పట్టించుకోకు వదిన
సత్య: అలా కాదులే బయటకు వెళ్లి చూద్దాం పద ఏం జరుగుతుందో. సత్య వాళ్లు వెళ్లే సరికి మహదేవయ్యకి ఫొటో గ్రాఫర్ ఫొటోలు తీస్తాడు.
భైరవి: చూశావా మీ మామ చిరునవ్వు ఫొటో అంటే ఇది గెలిచేవారి చిరునవ్వు అది. నీకు టెన్షన్ మొదలైంది కదూ.
క్రిష్: నీకు అలాంటి ఫొటోలు తీసుకోవాలి అనిపిస్తుంది కదూ
నందిని: తీసుకుంటే మీ వాళ్లు ఊరుకుంటారా.
క్రిష్: మేం అడ్డు పడే రకం కాదు. మా బాపు గెలుపు పక్కా మా వాడికి చెప్తా రెండు ఫొటోలు తీసేసి పడేస్తాడు.
భైరవి: చిన్నా అదేంట్రా.
క్రిష్: రెండు ఫొటోలతో మనకు ఏం అడ్డం కాదులే ఇప్పుడు వదిలేస్తే ఇంత కంటే మంచి ఫొటో షూట్ చేసేస్తారు. చూసి చూడనట్లు వదిలేద్దాం.
భైరవి: అంతే అంటావా.
క్రిష్: అంతే అమ్మా
క్రిష్ ఫొటో గ్రాఫర్‌తో తన భార్య ఫొటోలు బాగా రావాలి అని చెప్పింది గుర్తుంది కదా అని ఎవరికీ తెలీకుండా చెప్తాడు. ఎవరికీ తెలీకుండా ఫొటోలు తీస్తారు. తర్వాత నందిని క్రిష్ వినేలా ఏంటి వదిన ఇంత లేట్ ఎవరో అదృశ్య శక్తిని కవాలి అన్నావ్ కదా అంటుంది.
సత్య: సమయానికి భలే గుర్తు చేశావ్ నందిని. నేను వెళ్లకపోతే తను బాధ పడేవాడు. తను బాధ పడితే నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఫేస్ బాగుంది కదా.
నందిని: నీకేంటి వదిన బంగారం.
క్రిష్: అసలు నీకు బుద్ధి ఉంది ఏంటి వాడెవడో కలుసుకోవడం ఏంటి నువ్వు దగ్గరుండి పంపడం ఏంటి.
నందిని: కొన్ని కొన్ని అలా కలిసి వచ్చేస్తాయి. వదినకు సపోర్ట్ కావాలి కదా అయినా నువ్వు ఎక్కడికి.
క్రిష్: ఏటిలోకి.. సత్య ఆటోని క్రిష్ ఫాలో అవ్వడం సత్య చూస్తుంది. నవ్వుకుంటుంది. ఇంతకు ముందు తను ఎక్కడికి వెళ్లినా క్రిష్ తీసుకెళ్లు అని వెంటపడేది ఇప్పుడు ఆ ఆదృశ్య శక్తిని కలవడానికి ఒక్కర్తే పోతుంది. కనీసం నాకు ఓ మాట కూడా చెప్పలేదు. అసలేమనుకుంటుంది. చేసింది అంతా నేను అయితే ఆ శక్తి ఎవరో సత్య ట్రాప్ చేస్తున్నాడు. వాడు ఎవడో ఇప్పుడు తెలుస్తుంది కదా ఉంది వాడికి.
క్రిష్ వినేలా సత్య నందినితో ఫోన్‌లో మాట్లాడుతుంది. లోకేషన్‌కి వచ్చేయ్ మని నందినికి చెప్తుంది. సత్య లొకేషన్‌కి వెళ్తుంది . క్రిష్ ఫాలో అయి కారు వెనక దాక్కుంటాడు. సత్య క్రిష్‌ని చూసి కావాలనే ఎక్కడ నా అభిమాని అని రెచ్చగొడుతుంది. ఇక ఇంతలో అక్కడ మరో వ్యక్తి వచ్చి సత్యని హాయ్ అంటాడు. సత్య క్రిష్‌ని ఉడికించాలని అతనే అభిమాని అనట్లు మాట్లాడుతుంది. మొదటి సారి మిమల్ని కలిశా అదీ ఇదీ అని క్రిష్‌ని రెచ్చగొడుతుంది. కూల్ డ్రింక్స్ తెస్తా అని సత్య వెళ్తే క్రిష్ ఆ వ్యక్తిని చితక్కొట్టి పంపేస్తాడు. సత్య కూల్ డ్రింక్స్ పట్టుకొని వచ్చి అభిమాని ఎక్కడా అని మొత్తం వెతికేస్తుంది. క్రిష్ మళ్లీ దాక్కుంటాడు. తర్వాత మళ్లీ అజ్ఞాత అభిమాని అని కాల్ చేస్తుంది మీరు అనుకొని వేరే వ్యక్తితో మాట్లాడేశా అనుకుంటుంది. ఇక ఓ చోటుకి వెళ్తే నందిని అబ్బాయిలా రెడీ అయి సత్యతో మాట్లాడుతుంది.
సత్య అబ్బాయి గెటప్లో ఉన్న నందినితో క్రిష్ చూసినట్లు చాలా చనువుగా ఉంటుంది. చేతిపై ముద్దు కూడా పెట్టుకుంటుంది. క్రిష్ రగిలిపోతాడు. అజ్ఞాత అభిమానిని కొట్టడానికి క్రిష్ వస్తాడు నందినిని చూసి ఓసినీ నువ్వా అనుకుంటాడు. సత్య క్రిష్‌తో నువ్వే ఆ అభిమాని అని నాకు తెలుసు అని అంటుంది అవును అని క్రిష్ ఒప్పుకుంటాడు. వెనకనుంచి నాకు సపోర్ట్ ఎందుకు అని నేరుగా సపోర్ట్ చేయొచ్చు కదా అంటే నువ్వు ఎమ్మెల్య అవ్వవు అని జాలితో నీకు సపోర్ట్ చేశాఅని నవ్వుతాడు. కావాలనే సత్యని కించపరుస్తాడు. నిజం ఒప్పుకోమని నందిని అంటుంది. సత్య నందినితో మీ అన్నయ్య బంధాలుకు బానిస ఎవరినీ వదులు కోలేడు అందుకే ఈ ఇబ్బంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

