Top 5 News: చిరంజీవి కీలక వ్యాఖ్యలు, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కలెక్షన్స్, రచయితలకు అన్నపూర్ణ ఆహ్వానం - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
నంది స్థానంలో గద్దర్ అవార్డ్స్, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు
Chiranjeevi Comments: సినీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టి ప్రదానం చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనని చిరంజీవి సమర్థించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా కేబినెట్ సభ్యులు అందరికీ తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు - 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
Ambajipeta Marriage Band Box Office collection in two days: 'కలర్ ఫోటో’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అడివి శేష్ 'హిట్ 2' చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి అలరించాడు. తాజాగా మరో ఎమోషనల్ హార్డ్ హిట్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్. శరణ్య ప్రదీప్, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రల్లో నటించారు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహాకు చెందిన మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్లో సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రభాస్ ‘కల్కి’లో గెస్ట్ రోల్స్ చేస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు - వాళ్లెవరో తెలుసా?
Kalki 2898 AD: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సినిమాటిక్ వ్యాల్యూస్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కొండ చిలువను పెంచుకుంటున్న స్టార్ హీరోయిన్! - షాకవుతున్న నెటిజన్లు
Sushmita Sen Own Pet Python: పెట్స్ అంటే ఇష్టం లేని వారుండరు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ముచ్చటగ పెంపుడు కుక్క లేదా పిల్లిని పెంచుకుంటారు. వాటితో సరదగా గడుపుతూ రిలాక్ష్ అవుతుంటారు. ఎక్కడికి వెళ్లిన వాటిని వెంట తెచ్చుకుంటూ ముద్దు చేస్తుంటారు. ఇది సాధారణ విషయమే. కానీ ముచ్చటపడి పామును పెంచుకోవడం గురించి విన్నారా? అదేంటి.. పామును పెంచుకోవడమా! షాక్ అవుతున్నారా? అవును.. ఓ బాలీవుడ్ బ్యూటీ ముచ్చటపడి పామును పెంచుకుంటుదట. ఆమె ఎవరో కాదు మాజీ విశ్వసుందరి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుష్మితా సేన్. ఆమెకు పాములంటే సరదా అట. ఆ మక్కువతోనే ఓ బుజ్జి పైథాన్‌ను (కొండచిలువను) పెంచుకుంటుందని టాక్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పబ్లిసిటీ కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంది, పూనమ్‌పై పోలీస్ కేసు పెట్టాలి - సినీ వర్కర్స్ అసోసియేషన్
Cine Workers Association demands FIR against Poonam Pandey: ప్రముఖ మోడల్,బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి వ్యవహారం సీరియస్ అవుతోంది. మరణంతో పబ్లిసిటీకి ప్రయత్నించిందంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. సినీ అభిమానులు, ప్రజల మనోభాలతో ఆటలాడుకున్న పూనమ్ పై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)