అన్వేషించండి
Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ - పిల్లలు ఎంత ఎదిగిపోయారో తెలుసా?
Alekhya Reddy Emotional Post: హీరో నందమూరి తారకరత్న రెండో వర్థంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తారకరత్న ఫోటో, పిల్లల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
1/4

హీరో నందమూరి తారకరత్న మరణించి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
2/4

తారకరత్నకు నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిర్వహించి పిల్లల ఫోటోలు షేర్ చేశారు. 'విధి నిన్ను మా నుంచి దూరం చేసిన రోజుని లోకంలో ఏదీ పూరించదు. నిన్ను కోల్పోయిన బాధ కాలం మాన్పలేని గాయం. మేం ఇలా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఇక్కడ లేకపోయినా నీ ఉనికి నువ్వు విడిచిన కలల్లో, మర్చిపోవడానికి నిరాకరించే ప్రేమలో, నిన్ను మాటలకు మించి, కాలాన్ని దాటి జీవితాలకు మించి మిస్ అవుతున్నాం.' అంటూ అలేఖ్య ఎమోషన్ పోస్ట్ చేశారు..
3/4

తారకరత్న అభిమానులు ఆమె పోస్ట్ కింద నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్నకు నిష్క అనే కూతురితో పాటు తనయ్ రామ్, రేయా అనే ఓ పాప, బాబు ఉన్నారు.
4/4

తారకరత్న గుండెపోటుకు గురై చికిత్స తీసుకుంటూ 2023 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నేడు రెండో వర్థంతి సందర్భంగా అలేఖ్య రెడ్డి కార్యక్రమాలు నిర్వహించి తారకరత్న, పిల్లల ఫోటోలు షేర్ చేశారు.
Published at : 18 Feb 2025 03:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion