అన్వేషించండి

Hari Hara Veera Mallu: నిజంగానే ఫ్యాన్స్ మనసులు 'కొల్లగొట్టినాదిరో...' - పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫుల్ సాంగ్ వచ్చేసింది!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి రెండో సింగిల్ 'కొల్లగొట్టినాదిరో..' రిలీజైంది. పవన్ కోర మీసాలతో ఫుల్ స్వాగ్‌లో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

Pawan Kalyan's Hari Hara Veera Mallu Kollagottinadiro Full Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ అంటేనే ఫ్యాన్స్‌కు ఫుల్ క్రేజ్. ఆయన నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పీరియాడిక్ అడ్వెంచర్ యాక్షన్ 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో..' ఫుల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇటీవలే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంది. 'కొరకొర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె జనుగులతో..' అంటూ సాగే పాట ఫ్యాన్స్ మనసులు నిజంగానే కొల్లగొట్టేలా ఉంది. లిరిక్స్‌కు అనుగుణంగా పవన్ మీసాలు తిప్పుతూ ఫుల్ స్వాగ్‌తో జానపద గీతానికి చేసిన డ్యాన్స్ చూసి హైప్ భారీగా పెంచేసింది. ఈ పాటలో పవన్‌తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ కలిసి కాలు కదిపారు. చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. మంగ్లీ ఆలపించారు. ఆమెతో పాటు రాహుల్ సిప్లిగంజ్, రమ్యబెహరా, యామిని ఘంటసాల కూడా ఈ పాటకు గొంతు కలిపినట్లు తెలుస్తోంది.

 

'హరిహర వీరమల్లు' మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఫస్ట్ పార్ట్‌ను 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మూవీకి సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. 

Also Read: అర్జున్ సర్కార్ వచ్చేశాడు... నాని మాస్ ర్యాంపేజ్‌కి విజిల్స్ గ్యారంటీ - 'హిట్ 3' టీజర్ అదుర్స్ అంతే

'హరిహర వీరమల్లు' మూవీ క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుందుతోంది. అయితే, క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం పవన్ ప్రజా పాలనలో బిజీగా ఉండడంతో అనుకున్న టైంకు మూవీ రిలీజ్ చేస్తారా..? లేదా..? అనే దానిపై సందేహాలు నెలకొనగా.. చెప్పిన టైంకే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల స్పష్టత ఇచ్చారు. తాజాగా.. విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి.

Also Read: కోవిడ్ తర్వాత నాని సిక్సర్... నేచురల్ స్టార్‌ ప్లానింగ్ మామూలుగా లేదు... సక్సెస్‌ఫుల్ హీరోయే కాదు, నిర్మాత కూడా

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget