Nani Birthday Special: కోవిడ్ తర్వాత నాని సిక్సర్... నేచురల్ స్టార్ ప్లానింగ్ మామూలుగా లేదు... సక్సెస్‌ఫుల్ హీరోయే కాదు, నిర్మాత కూడా
Nani Birthday: నాని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కరోనా నుంచి ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్ హీరోగా 8 సినిమాలను తెరకెక్కించి, నెమ్మదిగా తన బ్రాండ్‌ను ఎలా బిల్డ్ చేసుకున్నారో తెలుసుకుందాం.

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు (Nani Birthday) నేడు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి పుట్టినరోజు విషెష్ వెల్లువెత్తుతున్నాయి. అయితే నాని జర్నీ సినిమా ఇండస్ట్రీలో కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా సాగుతోంది. పాండమిక్ వచ్చిన తర్వాత చాలామంది యంగ్ హీరోలు సినిమాల విషయంలో వెనుకబడి పోయారు. కొంతమంది నటులు వరుస డిజాస్టర్లతో సతమతమవుతుంటే, మరి కొంతమంది హీరోలు ఒకటీ అరా హిట్ సినిమాలతో నెట్టుకొస్తున్నారు. కానీ నాని మాత్రమే కరోనా తర్వాత సక్సెస్ ఫుల్ హీరోగా, నిర్మాతగా చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తూ వచ్చారు.
కరోనాకు ముందు, తరువాత నాని జర్నీ
తన పేరుకు ముందున్న ట్యాగ్ కు తగ్గట్టే తరచుగా సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు నాని. కెరీర్ మొదటి నుంచి ఇలాగే ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో కేవలం కమర్షియల్ సినిమాకే పరిమితం అయిపోలేదు. ఆయన జర్నీలో ప్రయోగాత్మక సినిమాలకు సైతం చోటిచ్చారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆయన చేసిన సినిమాలు నెమ్మదిగా హిట్ అంటే నాని... నాని అంటే హిట్ అన్పించే విధంగా ఆయన ఓన్ బ్రాండ్ ను సైలెంట్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ హోప్స్ పెట్టుకోగలిగే స్టార్ గా ఎదిగారు.
నాని హీరోగా కరోనా నుంచి ఇప్పటిదాకా 6 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఆ లిస్టులో శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలు ఉన్నాయి. ఇక త్వరలోనే 'హిట్ 3' రిలీజ్ కాబోతోంది. ఒక్కసారి ఈ సినిమాలన్నీ గమనిస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ముఖ్యంగా జానర్లు డిఫరెంట్ గా ఉంటాయి. అంటే నాని తన అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు. ఇక నిర్మాతగా ఆయన తన హోం బ్యానర్ వాల్ పోస్టర్ కింద కంటెంట్ బేస్డ్ సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నాని నిర్మాతగా రూపొందిన 'హిట్ 2', 'ఆ' వంటి సినిమాలు క్వాలిటీ కంటెంట్ ను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో నాని ప్యాషన్ ఏంటో నిరూపిస్తున్నాయి. ఫలితంగా నాని వరుస సక్సెస్ లతో తన ఖాతాలో వేసుకున్నారు.
నాని ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్...
'దసరా' మూవీతో మొదలు పెట్టిన హిట్ దండయాత్రను హయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో కొనసాగించాడు నాని. ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అయితే 2021 నుంచి 2025 మధ్య చాలా మంది టాలీవుడ్ నటులు పేక్షకుల అభిరుచికి తగ్గ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో సినిమాల విషయంలో వాళ్లంతా వెనకబడిపోయారు. కానీ నాని మాత్రమే నటుడిగా ఆరు, నిర్మాతగా రెండు... మొత్తం ఎనిమిది సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగామ్ హీరోగా మారారు. కన్సిస్టెంట్ గా హిట్లను డెలివరీ చేస్తూ, సైలెంట్ గా పవర్ ఫుల్ హీరోగా నాని తన ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కమర్షియల్ గానూ సక్సెస్ ఫుల్ సినిమాలతో తెలుగు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఆయన మరిన్ని హిట్లతో ఇలాగే ప్రేక్షకులను పలకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం 'హిట్ 3' సినిమా చేస్తున్నారు నాని. ఇది కాకుండా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ప్యారడైజ్' అంగీకరించారు. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.





















