నాని to 'నేచురల్ స్టార్'... ఆయన లైఫ్‌లో తక్కువ మందికి తెలిసిన 10 సమ్‌గతులు

నాని అసలు పేరు నాని కాదు... నవీన్ బాబు. ఆయన ఇంటి పేరు గంటా.

నాని పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లో! సేంట్ అల్ఫోన్స్ స్కూల్, నారాయణ జూనియర్ కాలేజీలో చదివారు.

హీరో కావడం కంటే ముందు 'వరల్డ్ శాటిలైట్ రేడియో'లో ఆర్జేగా పని చేశారు.

'నాన్ స్టాప్ విత్ నాని' పేరుతో రేడియోలో ప్రోగ్రాం రన్ చేశారు నాని.

ఆర్జేగా చేసిన తర్వాత అసిస్టెంట్ దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. బాపు దగ్గర పని చేశారు.

బాలకృష్ణ 'అల్లరి బుల్లోడు', విష్ణు మంచు 'అస్త్రం' - 'ఢీ' సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు.

'అష్టా చమ్మా'తో కెమెరా ముందుకు వచ్చారు నాని. హీరోగా ఆయన తొలి సినిమా అది.

'ఓకే బంగారం'లో దుల్కర్ సల్మాన్ పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

'బిగ్ బాస్ 2' తెలుగుకు నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకోసారి ఆ షోకి హోస్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు.

ఒక ప్రోగ్రాం కోసం సద్గురును ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఐఫా ఉత్సవం 2017కి హోస్ట్ చేశారు నాని.

'వాల్ పోస్టర్ సినిమా' ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన నాని... 'ఆ', 'హిట్' ఫ్రాంచైజీ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశారు.

చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా నిర్మాతలలో నాని ఒకరు.

ఇప్పుడు 'హిట్ 3'తో పాటు 'ప్యారడైజ్', సుజీత్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు నాని.