నటుడిగా తెలుగులో సముద్రఖని హిట్స్ ఏవో తెలుసా?

తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన 'శంభో శివ శంభో'లో సముద్రఖని అతిథి పాత్ర చేశారు.

సముద్రఖనిలో నటుడిగా తెలుగు తెరపై 'అల వైకుంఠపురములో'తో త్రివిక్రమ్ ఆవిష్కరించారు. 

'అల వైకుంఠపురములో', ఆ తర్వాత 'క్రాక్'లో సముద్రఖని విలన్ రోల్స్ సూపర్ హిట్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లోనూ సముద్రఖని రోల్ బాగుంటుంది.

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో సముద్రఖని పాజిటివ్ రోల్ చేశారు. నటుడిగా ఆయనకు టర్నింగ్ పాయింట్ అది.

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ తండ్రిగా విలన్ రోల్ చేశారు. 

'సర్కారు వారి పాట' తర్వాత 'సార్', 'దసరా' వంటి హిట్స్ చేసినా... 'విమానం'లో వికలాంగుడిగా కంటతడి పెట్టించారు.

'హను - మాన్'లో విభీషణుడిగా సముద్రఖని ఆహార్యం, నటన ప్రశంసలు అందుకుంది.

ధనరాజ్ దర్శకత్వం వహించిన 'రామం రాఘవం'లో హీరో తండ్రిగా కీలక పాత్రలో మరోసారి కంటతడి పెట్టించారు. 

నటుడిగా సముద్రఖని చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.