హుషారు హిట్టే కానీ ప్రియా వడ్లమాని కెరీర్ సంగతేంటి?

'హుషారు'లో సిద్ శ్రీరామ్ హిట్ సాంగ్ 'ఉండిపోరాదే'తో పాపులర్ అయిన హీరోయిన్ ప్రియా వడ్లమాని.

'హుషారు' విజయంతో ప్రియా వడ్లమాని మీద ప్రేక్షకుల చూపు పడింది. ఈ హీరోయిన్ తెలుగు అమ్మాయే.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆగస్టు 27, 1997న జన్మించిన తెలుగు అమ్మాయి ప్రియా వడ్లమాని.

'హుషారు' కంటే ముందు 'శుభలేఖ+లు', 'ప్రేమకు రెయిన్ చెక్' సినిమాలు చేశారు ప్రియా. ఆ రెండూ చాలా మందికి తెలియదు.

'హుషారు' విడుదలకు ముందు ప్రియా వడ్లమాని చేసిన సినిమాలు 'ఆవిరి','కాలేజ్ కుమార్'.

రవిబాబు నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'ఆవిరి'లో ప్రియా వడ్లమాని ఓ రోల్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్. 

రాహుల్ విజయ్ జోడీగా తెలుగు, తమిళ సినిమా 'కాలేజ్ కుమార్' చేస్తే... అదీ ఫ్లాప్ అయ్యింది. 

సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లేతో వచ్చిన 'ముఖచిత్రం'లో డ్యూయల్ షేడ్ రోల్ చేశారు. మోస్తరుగా ఆడింది.

'ముఖచిత్రం' తర్వాత 'మనుచరిత్ర' విడుదలైనా... అది ఎప్పుడో 'హుషారు'కు ముందు చేసిన సినిమా. అదీ ఫ్లాపే.

శ్రీవిష్ణు హిట్ సినిమా 'ఓం భీమ్ బుష్'లో ప్రియా వడ్లమాని ఐటమ్ సాంగ్ చేశారు.

ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమా 'వీరాంజనేయులు విహారయాత్ర'లో రాగ్ మయూర్ సిస్టర్ రోల్ చేశారు ప్రియా వడ్లమాని.

'విశ్వం'లో అతిథి పాత్రలో, 'బ్రహ్మ ఆనందం'లో రాజా గౌతమ్ ప్రేయసిగా ప్రియా వడ్లమాని నటించారు. ఆ రెండూ ఫ్లాప్.

ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ 'సమ్మేళనం'లో ప్రియా వడ్లమాని హీరోయిన్. ఈ సిరీస్ కూడా సోసోగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి.

ప్రియా వడ్లమాని కెరీర్ మళ్ళీ హుషారుగా ముందుకు వెళ్లాలంటే మంచి హిట్ ఆమె ఖాతాలో పడాలి.