మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ లవ్ స్టోరీ.. వయసులో ప్రిన్స్ కంటే పెద్ద అయినా
టాలీవుడ్ క్యూట్, ఐడియల్ కపుల్స్లో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఒకరు.
ప్రేమించి పెళ్లి చేసుకుని.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ.. కెరీర్లో ముందుకు వెళ్తూ.. అభిమానులతో పాటు అందరికీ వీరు ఆదర్శంగా నిలిస్తున్నారు.
అయితే వీరి లవ్ స్టోరి కూడా చాలా క్రేజీగా సాగింది. పైగా మహేశ్ కంటే నమ్రతా వయసులో నాలుగేళ్లు పెద్ద.
వంశీ సినిమా చేస్తున్న సమయంలో మహేశ్, నమ్రతా మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. 1999లో ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది.
దాదాపు అయిదేళ్ల తర్వాత 2005లో వీరు వివాహం చేసుకున్నారు. అతడు మూవీ షూటింగ్ సమయంలో మహేశ్ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలు తగ్గించేశారు. అనంతరం కెరీర్ను పూర్తిగా ఫ్యామిలీకి అంకింత చేశారు.
మహేశ్ నమ్రతలకు ఇద్దరు పిల్లలున్నారు. గౌతమ్, సితార కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమే.
ఫిబ్రవరి 10, 2025తో వీరు పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు అయింది. దీంతో మహేశ్ ఇన్స్టాలో ఫోటో షేర్ చేసి.. క్యూట్ నోట్ పోస్ట్ చేశారు.
You, me and 20 beautiful years…To forever with you NSG♥️♥️ అంటూ మహేశ్ బాబు ఇన్స్టాలో పోస్ట్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు.
మహేశ్, నమ్రత జంట అంటే సెలబ్రెటీలే కాదు ఫ్యాన్స్కి కూడా చాలా అభిమానం.