హీరోగా సుమంత్ హిట్ ఫిలిమ్స్... తప్పకుండా చూడాలి గురూ

ఏయన్నార్ మనవడిగా, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సుమంత్ వెండితెరపై అడుగు పెట్టారు. 

ఆర్జీవీ 'ప్రేమ కథ'తో సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ రిజల్ట్ పక్కన పెడితే... ఆయన కెరీర్‌లో మస్ట్ వాచ్ ఫిల్మ్స్!

సుమంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అంటే 'సత్యం'. ప్రేమ కథల్లో ఈ సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది.

సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'గోదావరి' ఎవర్ గ్రీన్ క్లాసిక్.

మేనమామ నాగార్జునతో కలిసి సుమంత్ నటించిన 'స్నేహమంటే ఇదేరా'ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇదొక ఎమోషనల్ ఫిల్మ్.

'క్లాస్‌మేట్స్‌' సినిమా ప్రేక్షకులు అందరికీ కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది.

రెగ్యులర్ కమర్షియల్ హీరో క్యారెక్టర్లకు భిన్నంగా 'గోల్కొండ హైస్కూల్'లో క్రికెట్ కోచ్ రోల్ చేశారు సుమంత్.

హీరోగా సుమంత్ రీ ఎంట్రీలో 'మళ్ళీ రావా'కు ఎప్పటికీ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇచ్చే చిత్రమిది. 

అతిథి పాత్రలకు వస్తే 'ఎన్టీఆర్' బయోపిక్ స్పెషల్. అందులో తన తాతయ్య ఏయన్నార్ పాత్ర చేశారు.

ధనుష్ 'సార్' సినిమాలోనూ సుమంత్ అతిథి పాత్రలో సందడి చేశారు. 

'సీతా రామం'లో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ నటనను అంత త్వరగా మరువలేం.

సుమంత్ హీరోగా నటించిన ఈటీవీ విన్ ప్రైజినల్ 'అనగనగా' త్వరలో విడుదల కానుంది.

'మహేంద్రగిరి వారాహి' అని మరో సినిమాలోనూ సుమంత్ నటిస్తున్నారు. ఇది థియేట్రికల్ రిలీజ్.