అన్వేషించండి

Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి

Sowcar Janaki Death : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. శ్వాస కోశ సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.

Veteran Actress Sowcar Janaki Passed Away : సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. శ్వాస కోశ సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న షావుకారు జానకి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

గత రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో వైద్యులు షావుకారు జానకిని ఐసీయులో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శుక్రవారం అత్యంత విషమంగా మారడంతో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆ సినిమానే ఇంటి పేరుగా...

ఏపీలోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించారు. అసలు పేరు శంకరమంచి జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి జానకి చెల్లెలు. చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ... ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 1943లో 'రక్షా రేఖ' సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె... 1950లో వచ్చిన 'షావుకారు' మూవీతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆ మూవీనే జానకి ఇంటిపేరుగా మారింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు షావుకారు జానకి.

తన కెరీర్‌లో 3 హిందీ సినిమాలు, ఒక మలయాళం చిత్రంతో మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆమెకు  2022లో పద్మశ్రీతో సత్కరించింది. 90 ఏళ్ల వయసులో షావుకారు జానకీ ఆ అవార్డు అందుకున్నారు. దీంతో పాటే రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 'వద్దంటే డబ్బు', 'కన్యాశుల్కం', 'పిచ్చి పుల్లయ్య', 'రేచుక్క పగటి చుక్క', 'రోజులు మారాయి', 'జయం మనదే', 'డాక్టర్ చక్రవర్తి', 'సంసారం ఒక చదరంగం', 'తోడికోడళ్లు', 'బాబు బంగారం', 'గీతాంజలి' మూవీస్‌లో నటించారు.

Also Read : Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్

సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి

షావుకారు జానకి మృతి పట్ల తమిళ, తెలుగు ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సహజ నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కమల్ హాసన్, రాధిక తదితరులు షావుకారు జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. 

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mookuthi Amman2 OTT : ఓటీటీలోకి నయనతార మహాశక్తి - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి నయనతార మహాశక్తి - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Niharika Konidela : నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్
నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్
Srimathi Movie Trailer : ఒకే ఒక్క ప్రశ్న... ఆలోచింపచేసే ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న నివేదా 'శ్రీమతి'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఒకే ఒక్క ప్రశ్న... ఆలోచింపచేసే ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న నివేదా 'శ్రీమతి'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vishnu Manchu Prabhudeva : ప్రభుదేవా డైరెక్టర్‌గా విష్ణు మంచు మూవీ - పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!
ప్రభుదేవా డైరెక్టర్‌గా విష్ణు మంచు మూవీ - పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Embed widget