SLBC Tunnel: SLBC సొరంగం వద్దకు ర్యాట్ హోల్ మైనర్స్! వీళ్లు ఏం చేస్తారు?
SLBC Tunnel: ఎప్పుడో నిషేధం విధించిన పద్దతిని ఇప్పుడు సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉపయోగించనున్నారు. గతంలో ఉత్తరాఖండ్‌లో ఇలానే కార్మికులను రక్షించారు.

SLBC Tunnel: నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (SLBC)లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో విజయవంతమైన టెక్నాలజీని వాడుతున్నారు. చిక్కున్న వారికి లోపల ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇసుక బురద ఉన్నందున అక్కడకు చేరుకోవడం కష్టమని అధికారులు చెబుతున్నారు. అసలు వారంతా ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు ఆక్వా ఐ పరికరాన్ని పంపిస్తున్నారు. మరోవైపు ఈ మధ్య ఉత్తరాఖండ్‌లో విజయవంతమైన ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్‌ను కూడా యూజ్ చేయాలని చూస్తున్నారు.
12 నవంబర్ 2023న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా బెండ్-బార్కోట్ సొరంగంలో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది సొంరగంలో చిక్కుకున్నారు. వారిని రక్షిచండానికి ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్ ఉపయోగించారు. ఇప్పుడు ఎస్‌ఎల్‌బీసీ వద్ద కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
శ్రీశైలం ఆనకట్ట వెనుక ఉన్న 44 కి.మీ పొడవైన ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో శనివారం ఉదయం 8మంది కార్మికులు చిక్కుకున్నారు. లీకేజీని మరమ్మతు చేస్తుండగా కూలిపోయింది. కొందరు తప్పించుకున్నా ఎనిమిది మంది మాత్రం తప్పించుకునే వీలు లేక ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం, నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీంలు మూడు రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వం యంత్రాంగమంతా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాం.
చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రమాద స్థలం బురద, నీటితో నిండిపోయి ఉందని అందుకే సహాయక చర్యలకు ఇబ్బందిగా మారుతోందని అన్నారు. వారిని రక్షించుకునేందుకు అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్ అంటే ఏంటీ?
ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్ అంటే ఎలుక బొరియ తరహాలో మైనింగ్ చేసే పద్ధతి. నాలుగు ఫీట్స్ వెడల్పు మించకుండా చాలా లోతుగా గుంతలను చేసే మెథడ్. భూమిలోనికి వెళ్లేందుకు సన్నని గుంతలు తవ్వుతారు. సాధారణంగా బొగ్గు లేదా ఇతర మైనింగ్ సంబంధిత కార్యక్రమాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కేవలం ఒక మనిషి వెళ్లేంత హోల్ మాత్రమే చేస్తారు. ఇలా హోల్ చేసిన తర్వాత తాళ్లు లేదా నిచ్చెనల సహాయంతో గమ్యానికి చేరుకుంటారు.
Also Read: వారిని టన్నెల్ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
సైడ్ కటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి భూమిని తవ్వుతారు. ముందు చిన్న చిన్న రంద్రాలు చేస్తారు. ముఖ్యంగా కొండ వాలులలో ఉన్న సందులను తవ్వి లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఉత్తరాంఖండ్‌లోని సిల్క్యారా బెండ్-బార్కోట్ సొరంగం వద్ద కూడా ఇలానే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సొరంగంలో దాదాపు 15 మీటర్లు ఇలా మాన్యువల్‌గా తవ్వి లోపలికి వెళ్లేందుకు మార్గాన్ని క్రియేట్ చేశారు. దీని ద్వారా వాళ్లకు ఆక్సిజన్, ఫుడ్, నీళ్లు పంపించారు. అనంతరం అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని పెద్ద హోల్ చేసి అక్కడి వారినిపైకి తీసుకురాగలిగారు. 17 రోజులుగా బంధీలుగా ఉన్న కూలీలను ఇలా ర్యాట్ హోల్ మైనింగ్ టీం బయటకు తేగలిగింది. ఇంత మందిని రక్షించడానికి ఉపయోగించిన ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్‌ను ఎప్పుడో నిషేధించారు.
ఎందుకు నిషేధించారు?
మేఘాలయలో ఉండే బొగ్గు గనుల్లో ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్‌ను ఉపయోగించి తవ్వకాలు చేస్తారు. ఇతర పద్ధతులు ఖర్చుతో కూడుకున్నవని దీన్ని ఎక్కువ ఉపయోగించేవాళ్లు. ఈ పద్ధతిలో సొరంగాలు అతి చిన్నగా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పర్యావరణానికి కూడా ముప్పుగా భావించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో అశాస్త్రీయ పద్ధదిగా తేల్చింది. అందుకే నిషేధం విధించింది. నాగర్‌కర్నూల్‌లో కూడా ఈ ర్యాట్ హోల్‌మైనింగ్ పద్దతిని ఉపయోగించాలని చూస్తున్నారు. ఆ టీమ్‌లు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్‌ఎల్‌బీసీ వద్ద జరిగిన ప్రమాదంలో చాలా భిన్నమైందని ఇంజినీర్లు అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

