Viral News: పెళ్లి వేడుకలో కాంగ్రెస్ హామీలపై వినూత్న నిరసన, తులం బంగారం ఎక్కడ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన
Adilabad News | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని ఓ పెళ్లి వేడుకలో ప్లకార్డులతో ప్రదర్శించడం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

తులం బంగారం ఏమైంది? అంటూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ప్లకార్డు ద్వారా పెండ్లిలో వినూత్నంగా నిరసన తెలిపిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా (కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాంబ్లె ఆమోల్ - గీతాంజలి ల వివాహా వేడుకలో ఇద్దరు నూతన వధూవరులు సహా పలువురు తులం బంగారం ఏమైంది అంటూ ప్ల కార్డులతో నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ ఏమైంది..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తమ ప్రభుత్వం వస్తే పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ అధికారంలో వచ్చి 15 నెలలు అవుతున్న తులం బంగారం ఇస్తలేరు, తులం బంగారం హామీ బోగస్ అయ్యిందని, పెళ్ళైన ఆడపిల్లకు ఇప్పటికైనా తులం బంగారం ఇవ్వాలని నూతన వదూవరులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. తులం బంగారం దేవుడేరుగు ఉన్న కల్యాణ లక్ష్మి ఇస్తలేరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెళ్ళైన ఆడబిడ్డకు మోసం చేస్తున్నాడని ,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు మేనమామ లాగ ఆదుకొని లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి సమయానికి ఇస్తుండే అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇస్తలేదని, ఇప్పటికైనా పెండ్లి అయినా ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి,తో పాటు తులం బంగారం ఇవ్వాలని ముఖరా (కే) గ్రామంలో జరిగిన పెళ్ళిలో నూతన వధూవరులు కాంబ్లె ఆమోల్ గీతాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖరా (కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ గ్రామస్తులు పెళ్లికి వచ్చిన బందువులు పాల్గొన్నారు.





















