IND vs PAK: క్లూ లెస్ మేనేజ్మెంట్.. బుర్ర లేని కెప్టెన్ -పాక్ టీంపై మాజీల ఫైర్
Champions Trophy 2025: క్లూ లెస్ మేనేజ్మెంట్.. బుర్ర లేని కెప్టెన్ -పాక్ టీం పై మాజీల. ఫైర్

IND vs PAK Champions Trophy 2025: "మేనేజ్మెంట్ కి వ్యూహం లేదు.. కెప్టెన్ కి బుర్ర లేదు " పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఛాంపియన్ ట్రోఫీ లో ఓటమి తర్వాత పాకిస్తాన్ టీం పై విరుచుకుపడిన తీరు. స్వయంగా ఈసారి టోర్నమెంట్ నిర్వహిస్తూ పాకిస్తాన్, దుబాయ్ పిచ్ లపై అవగాహన లేకపోతే ఎలా అంటూ పాకిస్తాన్ మేనేజ్మెంట్ పై దుమ్మెత్తి పోశాడు. పిచ్ లు దృష్టిలో పెట్టుకుని టీం ని ఎంపిక చేయాలి గానీ తమకు నచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసి పంపిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అక్తర్ సహా మాజీ లందరూ పిసిబిని ఏకుతున్నారు.
ఒక్క స్పిన్నర్ తో వెళ్లడమా..
ఒకవైపు ఇండియన్ టీం పూర్తి ఆధిపత్యం చాలాయిస్తుంటే పాక్ టీం మాత్రం ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిందని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వాపోయారు. మరో బెటర్ రమీజ్ రాజా అయితే మెంటల్ గా టెక్నికల్ గా ఇండియన్ టీం స్ట్రాంగ్ గా ఉంటే పాకిస్తాన్ పూర్తిగా దానికి విరుద్ధంగా ఉందని అన్నారు. దుబాయ్ పిచ్ పై ఇండియన్ టీం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే పాక్ కెప్టెన్ రిజ్వాన్ మాత్రం ఒక్క స్పిన్నర్ తోటే టీంని రెడీ చేయడం పూర్తిగా తప్పని విశ్లేషించారు.
పాకిస్తాన్ పై ఇండియా గెలిస్తే ఇండియన్ ఫాన్స్ సైతం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం లేదని ఎందుకంటే ఇండియా గెలుస్తుందని వాళ్లకు ముందే తెలుసని పాకిస్తాన్ టీం ప్రదర్శన కొన్నేళ్లుగా ఇండియా పై ఎంత అద్వాన్నంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇండియన్ ఫ్యాన్స్ పాక్ తో కంటే బంగ్లాదేశ్ తో ఆడినప్పుడు ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ చూస్తున్నారని రమీజ్ అన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్లో కనీసం 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ పూర్తి చేయలేకపోవడాన్ని మించిన అవమానం ఇంకొకటి లేదని రమీజ్ పాకిస్తాన్ టీం పై ఫైర్ అయ్యారు.
ఒకే ఒక్క స్పిన్నర్ తో ట్రోఫీ గెలిచేద్దాం అనుకుంటున్నారా..? ఇంజమామ్
మరో పాకిస్తాన్ లెజెండ్ ఇంజమామ్ -ఉల్ -హక్ అయితే ఛాంపియన్ ట్రోఫీలో ఆడుతున్న దేశాల్లో కేవలం ఒకే ఒక్క స్పిన్నర్ తో బరి లోకి కి దిగింది పాకిస్తాన్ మాత్రమే అని ఇది అస్సలు ముందు చూపు లేని ఆలోచనని విమర్శించాడు. అసలు పాకిస్తాన్ టీం కి రెగ్యులర్ ఓపెనర్ లేడని మూడో నెంబర్ లో స్థిరంగా ఆడుతున్న బాబర్ ఆజాం ను సడన్ గా ఓపెనింగ్ కు తీసుకు రావడం బుద్ధి తక్కువ పని అని తిట్టి పోశాడు. టీం ప్రదర్శన కన్నా ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీ కి బుర్ర లేదని ఆల్టర్నేటివ్ ఓపెనర్ లేకుండానే అంత పెద్ద టోర్నీ కి టీని ఎలా సెలెక్ట్ చేశారంటూ మండిపడ్డాడు. మరో మాజీ ఆటగాడు మహమ్మద్ ఆఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లానింగ్ గట్టిగానే చేస్తుంది కానీ ఆట లోకి వచ్చేసరికి ఆడదని అన్నాడు.
పాకిస్తాన్ దగ్గర అసలు విన్నింగ్ మంత్రానే లేదని దుబాయ్ పిచ్ లపై 240 వరకూ పరుగులు చేస్తే గెలవడానికి అది సరిపోతుందని కానీ స్పిన్నర్లు టీం లో ఉండాలని అది లేకపోవడం వల్లే పాక్ ఇంత ఘోరంగా ఓడిపోయిందని అభిప్రాయపడ్డాడు. షోయబ్ మార్క్ సైతం పాక్ టీం పై మండి పడ్డాడు. ఇది ఒక వేకప్ కల్ అని టి20 ఫార్మాట్ ఇమేజ్ నుండి పాక్ టీం బయటపడాలని 4 ఓవర్ల బ్యాటింగ్.. 4 ఓవర్ల బౌలింగ్ చేస్తే చాలనే మైండ్ సెట్ నుండి ఆటగాళ్లు బయటికి రావాలని సూచించారు. మరోవైపు సెంచరీ తో ఫామ్ లోకి వచ్చి చేజ్ మాస్టర్ గా ఇంకోసారి నిరూపించుకున్న విరాట్ కోహ్లీ పై పాక్ మాజీలు ప్రశంసలు కురిపించారు.




















